Balakrishna's Dada Dhamaka Song Lyrics : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దాదా' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'దాదా ధమాకా' అంటూ శుక్రవారం రిలీజైన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా... బాలయ్యతో పాటు రజనీ శ్రీ పూర్ణిమ పాడారు. బాలయ్య, నర్గీస్ ఫక్రీ స్టెప్పులతో పాటు తమన్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి బాలయ్య పాడిన పాట లిరిక్స్ ఓసారి చూస్తే...
దాదా ధమాకా సాంగ్ లిరిక్స్
షహరంతా అదిరిపోనీ... నిదరంత చెదిరిపోనీ...
జామురాతిరీ జాగరం చెయ్యనీ పరువాన్నీ...
దిల్ మంట రగిలిపోనీ... వయసంత మరిగిపోనీ...
మందు మత్తుకీ అందమే కమ్మనీ బిరియానీ...
(హుక్)
నువ్ గమ్మునుంటవ్ నచ్చలే నచ్చలే...
ఆజనాతో నచ్చలే నచ్చలే...
ఆట పాట తాట తీద్దాం...
వద్దు అంటే ఒప్పుకోను అస్సలే...
హే బావలే బావలే బావలే...
ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే...
బావలే బావలే బావలే
ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే...
నువ్ గమ్మునుంటవ్ నచ్చలే నచ్చలే...
ఆజనాతో నచ్చలే నచ్చలే...
ఆట పాట తాట తీద్దాం...
వద్దు అంటే ఒప్పుకోను అస్సలే...
బావలే బావలే బావలే
ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే...
బావలే బావలే బావలే
ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే...
చరణం 1
ఇసలత్తుమే రంగ్ బరుసే... పట్టి గుంజుతాంది కన్నె సొగసే...
పిల్ల తిప్పుడు గిప్పుడు జకాస్...
మేరా దంచుడు తచ్చుడు మిథాస్
రొమాన్స్ ఇరగేసే... మన కత్తికేమో టూ సైడ్సే
దేవ దేవ దేవాది దేవ... మాన్‌స్టరల్లే దూకేసిరావా...
ఈస్సికారే... మాస్ కారే రగ రగ భగ భగ సెగలే...
బావలే బావలే బావలే
ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే...
Also Read : Mega Verse OTT : మెగాస్టార్ టాక్ షో... చిరు ఓటీటీ ఎంట్రీ - ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా... ఇద్దరి కాంబోలో వచ్చిన రెండో మూవీ ఇది. గతంలో గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ప్రభుత్వ అధికారిణిగా కనిపించనున్నారు. రాకింగ్ మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌తో పాటు అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది.
