Balakrishna's Akhand 2 Teaser Sigature Moment Scene: గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఆయన బర్త్ డేకు బిగ్ సర్‌ప్రైజ్‌గా 'అఖండ 2' టీజర్ వచ్చేసింది. స్టార్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మార్క్ కనిపించేలా బాలయ్యను 'అఘోర'గా మాస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంతకు మించి ఉంటాయా అనే బాలయ్య ఎలివేషన్ ఉంది.
త్రిశూలమా.. సుదర్శన చక్రమా?
తొలుత హిమాలయ ప్రాంతాలను టీజర్‌లో చూపించగా.. త్రిశూలం చేతబట్టి అఘోరగా ఒంటినిండా విబూదితో సాక్షాత్తూ హిమాలయాల్లోని పరమశివుడే దిగి వచ్చాడా? అనేట్లుగా బాలయ్య ఎలివేషన్ అదిరిపోయింది. టీజర్‌లో ఆయన ఎంట్రీనే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జటాజూటధారియై.. ఆయుథం చేతబట్టి ధర్మాన్ని కాపాడేందుకు శత్రు సంహారం చేసిన ఓ యోధుడిలా బాలయ్యను చూపించారు బోయపాటి.
'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా?, అమాయకుల ప్రాణాలు తీస్తావా?' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. త్రిశూలంతోనే శత్రువులను గాల్లోకి ఎగరేయడం, త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా మెడ చుట్టూ తిప్పుతూ ఎదురుగా వస్తోన్న శత్రువులను నడుచుకుంటూనే సంహరించిన తీరు సాక్షాత్తూ.. హరిహరులు కలిసి ధర్మాన్ని కాపాడేందుకు తరలివస్తున్నారా? అనేట్లుగా ఉంది. టీజర్‌లో ఇదే హైలెట్ అని.. మూవీలో ఈ ఒక్క సీన్ చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: బాలయ్య రుద్ర 'తాండవం' - 'అఖండ 2' టీజర్ వేరే లెవల్.. థియేటర్స్ దద్దరిల్లుతాయంతే!
సింహం రూపంలో శివుడు
'సింహం రూపంలో శివుడు, ధగ ధగ తాండవం' అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టీజర్ రిలీజ్‌కు ముందు అక్షరాలా ఇచ్చిన హైప్ నిజమైంది. పరమ శివుడు జటాజూటధారియై సింహం రూపంలో నేరుగా భువికి దిగి వచ్చారా? అనేలా.. శత్రువుల వైపునకు దూసుకొచ్చిన తీరు వేరే లెవల్ అంతే. వెపన్స్‌తో ఉన్న వారిని తన త్రిశూలం, భుజాలపైనే బాలయ్య గాల్లోకి ఎగరేయడం టీజర్‌లో ప్రతీ ఫ్రేమ్‌ను మళ్లీ చూడాలనిపించేలా చేస్తోంది. ఇక తమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ పేర్కొంటున్నారు.
స్టోరీ అదేనా?
పాన్ ఇండియా స్థాయిలో డివోషనల్ అంశాలతో ముడిపెడుతూ మాస్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ మూవీని తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. దేశాన్ని నాశనం చేసేందుకు సరిహద్దులను దాటి వస్తోన్న శత్రువులను తన ఒంటి చేత్తోనే మట్టి కరిపించిన యోధుడిలా బాలయ్య కనిపించనున్నట్లు అర్థమవుతోంది. 'అఘోర'గా సాక్షాత్తూ శివుడి రూపంలో శత్రువులను అంతమొందించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..
ఒక్క టీజర్‌తోనే బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు బోయపాటి. ఇక మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అంచట, గోపీ అచంట మూవీని నిర్మిస్తుండగా.. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. 'దసరా' సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.