Balakrishna Akhanda 2 Premiere Shows Cancelled : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో 'అఖండ 2' కోసం బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ వేయాల్సి ఉండగా వాటిని క్యాన్సిల్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Continues below advertisement

అసలు రీజన్ ఏంటంటే?

సాంకేతిక సమస్యల కారణంగా ప్రీమియర్ షోస్ వేయలేకపోతున్నట్లు వెల్లడించింది. అటు, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ మాత్రం యాథావిధిగా వేయనున్నట్లు తెలిపింది. 'ఇండియాలో అఖండ 2 ప్రీమియర్స్ రద్దయ్యాయి. మేము మా శాయశక్తులా ప్రయత్నించాం. కానీ కొన్ని విషయాలు మా పరిధికి మించి ఉన్నాయి. అసౌకర్యానికి క్షమించండి.' అంటూ X వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రాసుకొచ్చింది.

Continues below advertisement

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్‌తో పాటు టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఇప్పుడు సడన్‌గా ప్రీమియర్స్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మార్నింగ్ షోతో 'అఖండ 2' ఇండియావ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - గ్లింప్స్‌తోనే ఫుల్లుగా భయపెట్టేశారు... వాళ్లు ఈ మూవీ చూడకుంటేనే బెటర్

టికెట్ ధరలు ఇవే

'అఖండ 2' టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వంలో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ధరల పెంపు వర్తించనుండగా... తెలంగాణలో 3 రోజుల పాటే పెంపు వర్తించనుంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీ ప్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.100 పెంపు వర్తించనుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా ఇలా పెంచుకోవచ్చు.

అటు ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.100 వరకూ ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు అదనంగా పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ టికెట్ ధరలు కూడా రూ.600గా నిర్ణయించాయి. కానీ అవి రద్దయ్యాయి.

ఫ్యాన్స్ వెయిటింగ్

బాలయ్య, బోయపాటి మూవీ అంటేనే పక్కా మాస్ ఎంటర్టైనింగ్ కన్ఫర్మ్. అంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. 'అఖండ'కు సీక్వెల్‌గా మూవీ రాబోతుండగా మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉండనుంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి అచంట నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు.