Balakrishna Akhanda 2 Second Song Release Date Locked : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అవెయిటెడ్ మూవీ 'అఖండ 2 తాండవం'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 'తాండవం' సాంగ్ ట్రెండ్ అవుతుండగా... మరో మాస్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు.
విశాఖ వేదికగా...
ఫస్ట్ సాంగ్ 'తాండవం' ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయగా... రెండో సాంగ్ విశాఖలో రిలీజ్ చేయనున్నారు. 'జాజికాయ, జాజికాయ' అంటూ లవ్ ట్రాక్‌లో సాంగ్ ఉంటుందని తెలుస్తుండగా... విశాఖ జగదాంబ థియేటర్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మరో ఈవెంట్‌లో ఈ పాట రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
మాస్ అంటేనే బాలయ్య... బాలయ్య అంటేనే మాస్. అలాంటిది ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా 'అఖండ 2' నుంచి రెండో సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఇద్దరూ కలిసి ఈ ఊర మాస్ సాంగ్‌లో స్టెప్పులు వేయనున్నారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. ఈ పాట... జై బాలయ్య సాంగ్‌ను మించేలా ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తుండగా... అఘోర పాత్రలో, మాస్ క్యారెక్టర్ మురళీ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. అఘోర రోల్‌కు సంబంధించి 'తాండవం' సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈసారి మాస్ సాంగ్ రిలీజ్ కానుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఒక్కో సాంగ్ స్పెషల్‌గా ఈవెంట్స్ కండక్ట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. మూవీకి తమన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలుస్తుండగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
3D ఫార్మాట్‌లోనూ...
ఈ మూవీని 3D ఫార్మాట్‌లోనూ రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. మూవీలో అది పినిశెట్టి విలన్ రోల్ చేస్తుండగా... హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.