తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకువచ్చిన 'బాహుబలి' విడుదలై నేటికి పదేళ్లు. జూలై 10, 2015లో 'బాహుబలి ది బిగినింగ్' థియేటర్లలోకి వచ్చింది. ఆ యానివర్సరీ సందర్భంగా సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 

బాహుబలి రీ రిలీజ్ కాదు...గ్రాండ్ ఎపిక్ రిలీజ్, ఒక్కటే!ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకు వస్తుంటే... భారీ వసూళ్లు వస్తున్నాయి. అయితే... రాజమౌళి ఆ ట్రెండ్ ఫాలో అవ్వడం లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో, బాక్సాఫీస్ బరిలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన... ఈ రిలీజ్ విషయంలోనూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. 

'బాహుబలి ‌ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్'... రెండు భాగాలను కలిపి ఒక్కటే సినిమాగా విడుదల చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు 'బాహుబలి ది ఎపిక్' అని పేరు పెట్టారు. ఆ సినిమాను ఈ ఏడాది ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దీనిని రీ రిలీజ్ అనొద్దని చిత్ర బృందం అంటోంది. అదీ నిజమే... రీ రిలీజ్ అంటే పాత సినిమాను విడుదల చేయడం. ఇప్పుడు రాజమౌళి కొత్త సినిమాగా రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

'బాహుబలి' రెండు భాగాలను ఒక్కటే సినిమాగా విడుదల చేయడం అంటే మాటలు కాదు. 'బాహుబలి' మొదటి పార్ట్ విడుదలైన తర్వాత 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అందరి మదిలో మెదిలింది‌‌. ఇప్పుడు రెండు పార్టులను ఒక్కటి చేయడం వల్ల కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయవలసి ఉంటుంది. ఏ సీన్ కట్ చేశారు? ఇప్పుడు ఏ ఫైట్ తీసేశారు? ఎవరి స్క్రీన్ టైమ్ ఎంత? ఎన్ని పాటలు ఉంటాయి? ప్రశ్నలు ఎన్నో ప్రేక్షకుల మదిలో ఉంటాయి. దాంతో సినిమా మీద ఆసక్తి నెలకొంటుంది.

ప్రభాస్ పుట్టినరోజు తర్వాత ఎందుకు?Prabhas Birthday: అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. అయితే 'బాహుబలి ది ఎపిక్' సినిమాను అక్టోబర్ 31న విడుదల చేస్తున్నారు. అదేదో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని బర్త్డే అయిన వారానికి ఎందుకని రెబల్ స్టార్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు విడుదల చేసినా అభిమానులకు పండగ అనేలా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?