Baahubali The Epic Day 1 Collection : 'బాహుబలి ది ఎపిక్' ఫస్ట్ డే కలెక్షన్స్ - పదేళ్ల తర్వాత కూడా క్రేజ్ తగ్గేదేలే
Baahubali The Epic Collection Day 1 : 'బాహుబలి ది ఎపిక్' థియేటర్లలోకి వచ్చేసింది. పదేళ్ల తర్వాత కూడా అంతే క్రేజ్‌తో దూసుకెళ్తుండగా... ఫస్ట్ డే కలెక్షన్స్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Rajamouli's Baahubali The Epic Day 1 Worldwide Box Office Collections : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' రెండు పార్టులు కలిపి 'బాహుబలి ది ఎపిక్' గురువారం సాయంత్రం ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే థియేటరల్లో డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పదేళ్ల తర్వాతైనా 'బాహుబలి' క్రేజ్ ఏమాత్రం తగ్గలేేదని తెలుస్తుండగా... ఫుల్ ఆక్యుపెన్సీతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
'బాహుబలి ది ఎపిక్' వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్లతో కలిపి రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇండియావ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.2.13 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ప్రముఖ సాక్నిల్క్ రిపోర్ట్ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే థియేటర్ ఆక్యుపెన్సీ 53.02 శాతం ఉన్నట్లు తెలిపింది. అటు, ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్‌లో అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. 2015లో వచ్చిన ఫస్ట్ పార్ట్ 'బాహుబలి: ది బిగినింగ్' వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా... రెండో పార్ట్ 'బాహుబలి: ది కంక్లూజన్' రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇన్నేళ్ల తర్వాత కూడా రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడంపై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read : 'బాహుబలి' vs 'మాస్ జాతర'... రవితేజపై రాజమౌళి దెబ్బ - బుకింగ్స్, క్రేజ్ కంపేర్ చేస్తే?
గూస్ బంప్స్ సీన్
'బాహుబలి ది ఎపిక్'లో యాడ్ చేసిన సీన్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. శివుడు తిరిగి మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యే సీన్ వేరే లెవల్ అని కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలికి మరింత ఎలివేషన్ ఇచ్చేలా బిజ్జలదేవుడు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. శివుడి చేతిలో తప్పించుకున్న ఓ సైనికుడు బిజ్జలదేవుని వద్దకు వెళ్లి... బాహుబలి బతికే ఉన్నాడని చెబుతాడు. దీంతో 'వాడి రక్తం భూమిలో ఇంకిపోయింది. వాడి శరీరం మంటల్లో కాలి బూడిదైంది. వాడి ప్రాణం ప్రాణహిత నదిలో కొట్టుకుపోయింది. కాలిన బూడిద గాలిలో చెల్లాచెదురైపోయింది. వాడి ఆయువు అనంత విశ్వంలో ఆవిరైపోయింది.' అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పగా... అదే టైంలో శివుడు మాహిష్మతిలోకి ఎంటర్ అవుతాడు.
ఆ టైంలో దేవసేన... 'మాహిష్మతి ఊపిరి పీల్చుకో... బాహుబలి తిరిగొచ్చాడు' అంటూ చెప్పే డైలాగ్ ఆ సీన్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. ఇంత మంచి సీన్ ముందు ఎలా మిస్ చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం బాహుబలి పోస్టులతో నిండిపోయింది. కొందరు థియేటర్లలో సీన్స్ రీక్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి మరి కొద్ది రోజులు ఈ జోష్ ఇలానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Best scene asla😭🔥#BaahubaliTheEpic pic.twitter.com/La1K6L2HBk
— Satyá (@TheMovieBufffff) October 30, 2025
Ee scene kosame theatre ki vellindi 💥💥💥 #BahubaliTheEpic pic.twitter.com/5GvjhYPx4w
— Vinay Pawanist 🗡️ 🐆 (@saivinay07) October 31, 2025
Ela unnar entra 😅#BaahubaliTheEpic #Prabhas #Baahubali #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/PailUMhIn6
— 𝙨𝙝𝙞𝙫𝙖ᵖˢᵖᵏ🦁 (@shiva_pspk_07) October 31, 2025
BAHUBALI IS AN EMOTION
— Aakash Varma (@AakashDommaraju) October 31, 2025
JAI MAHISMATHI
BAHUBALI JAYAHO
JAI REBEL STAR PRABHAS RAJU
🥺🛐❤️🔥💥❤️#BahubaliTheEpic #Prabhas @BaahubaliMovie @Shobu_ @ssk1122 @RanaDaggubati @DOPSenthilKumar pic.twitter.com/6TkxVqF08O





















