Director Ayan Mukerji About NTR Hrithik Roshan Action Scenes In War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'. ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా 'వార్ 2' ఆరో చిత్రంగా రాబోతోంది. ఈ మూవీకి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. తాజాగా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆడియన్స్ అంచనాలకు అనుగుణంగా వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. 

ఎన్టీఆర్ హృతిక్ వార్

ఈ ప్రాజెక్టు విషయంలో తనకు ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయని డైరెక్టర్ ఆయాన్ తెలిపారు. యాక్షన్ సీక్వెన్స్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల మధ్య ఫైట్ సీన్స్ తీసేందుకు చాలా టైం తీసుకున్నట్లు చెప్పారు. 'ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన 'వార్' సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడడం ఓ పెద్ద బాధ్యత. ఇలాంటి భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేస్తుండడంతో స్టోరీ లైన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.

'వార్ 2' డైరెక్ట్ చేసేటప్పుడు నా ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినట్లే భావించాను. ఆడియన్స్‌కు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా స్టోరీని, అందుకు తగినట్టు యాక్షన్ సీన్స్ తీశాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒక చోటికి చేరేలా ఈ సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు. థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు వారికి జీవితాంతం గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ప్రతీ సెకన్ శ్రమిస్తున్నా.' అని చెప్పారు.

Also Read: ఆడపులి పేరు 'క్లీంకార' - జూ పార్కుకు ఉపాసన థాంక్స్.. మెగా గారాల పట్టి బర్త్ డే స్పెషల్..

ఆగస్ట్ 14న రిలీజ్

ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. 'నా కళ్లు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కబీర్.' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మోడ్రన్ స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ అదరగొట్టగా.. హృతిక్‌తో భారీ యాక్షన్ సీన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. 'వార్' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా.. బాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్ సక్సెస్ అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.