Is Avika Gor Returning To Television : చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో వరల్డ్ వైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు హీరోయిన్ అవికా గౌర్. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఆఫర్స్ అందుకున్నారు. వెండితెరపై, ఓటీటీల్లోనూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్‌గా తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీలో నటించారు. ఇప్పుడు ఈ బ్యూటీ మళ్లీ టీవీ సీరియళ్లలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పెట్టిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.
మొదలు పెట్టిన చోటుకే...
తాను కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశానో... మళ్లీ అక్కడికే చేరుకుంటున్నట్లు పరోక్షంగా పోస్ట్ చేశారు అవికా. 'నేను ప్రయాణం మొదలు పెట్టిన చోటుకే మళ్లీ చేరుకోవడం ఎంతో అందమైన విషయం. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. మన కొత్త దారుల్లో ప్రయాణించడాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ, జీవితం అప్పుడప్పుడు మనల్ని మన మూలాల దగ్గరికి తీసుకెళ్తుంది.
అయితే, అది వెనక్కి తగ్గినట్లు కాదు. ఒక కొత్త కోణంలో దాన్ని అర్థం చేసుకునేంతగా మనం ఎదిగామని అర్థం. మీ కలలను, మీరు చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా ప్రేమించిన మీలోని రూపాన్ని గుర్తు చేస్తాయి. ప్రతీ కొత్త అధ్యాయాన్ని సాధ్యం చేసిన ప్రతీ ఆరంభానికి ఈ రోజు నేను కృతజ్ఞతతో ఉన్నా.' అంటూ రాసుకొచ్చారు.
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు అవికా గౌర్. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ దక్కించుకున్నారు. తొలుత హిందీ మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. ఆ తర్వాత ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, పాప్ కార్న్, అగ్లీ స్టోరీ సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేశారు. ఇప్పుడు మళ్లీ సీరియళ్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
