Nandamuri Kalyan Ram's Arjun Son Of Vyjayanthi Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషించారు. ఇవాళ థియేటర్లలోకి సినిమా వచ్చింది. యూఎస్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. మూవీలో హైలైట్స్ ఏమిటి?
అమెరికా నుంచి మిక్స్డ్ టాక్!అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు అమెరికా నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కొందరు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా అని చెప్పగా... మరికొందరు కమర్షియల్ అంశాలతో దర్శకుడు మంచి సినిమా తీశారని చెప్పుకొవచ్చారు. సెకండ్ హాఫ్ కూడా కమర్షియల్ వేలో సాగిందట. అయితే క్లైమాక్స్ 20 నిమిషాలు సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకొచ్చారు. ఓవరాల్ టాక్ చూస్తే సూపర్ హిట్ అని ఎవరూ చెప్పడం లేదు. కమర్షియల్ సినిమా అంటున్నారు తప్ప బావుందని అనడం లేదు.
తల్లి కొడుకుల పాత్రలే కీలకం!అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో తల్లి కొడుకులుగా విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి పాత్రలే సినిమాకు కీలకం అని ప్రీమియర్ షోస్ నుంచి టాక్ లభించింది. మదర్ సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కవుట్ చేశారట. కొంత మంది ఆ ఎమోషనల్ సీన్స్‌తో పాటు సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: ఎవరీ ప్రియాంక? రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకంత డిస్కషన్... వశీతో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమకథ తెల్సా?
కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రల మీద దర్శకుడు పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెట్టలేదని చెబుతున్నారు అమెరికాలో ప్రీమియర్ షో చూసిన జనాలు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్రకు అసలు ఇంపార్టెన్స్ లేదట. దర్శక నిర్మాతలు ముందు నుంచి ఆ విషయం చెబుతూ వచ్చారు. అయితే తల్లి కొడుకుల క్యారెక్టర్ల మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేయడం వల్ల కథ దెబ్బతిందని టాక్.
పాటలే కాదు... ఆర్ఆర్ కూడా!అర్జున్ సన్నాఫ్ వైజయంతికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కమర్షియల్ సినిమాకు అవసరమైన ఆర్ఆర్ ఇవ్వడంలో ఆయన ఫెయిల్ అయ్యారని ఓవర్సీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి తెలుగు ఆడియన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
Also Read: ఓదెల 2 రివ్యూ: తమన్నాతో 'అరుంధతి' తీయాలని ట్రై చేస్తే ఏమైంది? సినిమా హిట్టా? ఫట్టా?
కమర్షియల్ టెంప్లేట్ ఫాలో అవుతూ తీసిన ఈ సినిమా ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంలో ఫెయిల్ అయ్యింది. మరి ఏపీ తెలంగాణలో జనాలను మెప్పిస్తుందో లేదో చూడాలి.