సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ తాజా ఇంటర్వ్యూ వివాదానికి తెర తీసింది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. మతపరమైన వివక్ష ఉందని చెప్పడంపై పలువురు భగ్గుమన్నారు. వివాదం పెరిగిన తర్వాత ఎ.ఆర్. రెహమాన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎ.ఆర్. రెహమాన్ పిల్లలు తమ తండ్రికి మద్దతుగా నిలిచారు. 

Continues below advertisement

ఎ.ఆర్. రెహమాన్ కు మద్దతుగా పిల్లలు

ఎ.ఆర్. రెహమాన్ కుమార్తె రహీమా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ''వీరికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదవడానికి కూడా సమయం లేదు. ఈ పవిత్ర గ్రంథాలు ప్రేమ, శాంతి, క్రమశిక్షణ, సత్యాన్ని బోధిస్తాయి. కానీ వీళ్లకు ఒకరితో ఒకరు వాదించుకోవడానికి, ఎగతాళి చేయడానికి, రెచ్చగొట్టడానికి, దూషించడాని, అవమానించడానికి ప్రపంచవ్యాప్తంగా సమయం ఉంది'' అని పేర్కొన్నారు. ఇంకా ఆమె ''ఇది మతం కాదు... ఇది అంధ సమాజం, అసంపూర్ణ విద్య, విషపూరిత రాజకీయాలు, పేలవమైన పెంపకం ద్వారా సృష్టించబడింది. మానవత్వం కంటే ద్వేషానికి ఎక్కువ విధేయత చూపే ఒక తరాన్ని చూస్తున్నాం'' అని అన్నారు.

Continues below advertisement

Also ReadMana Shankara Varaprasad Garu BO Day 9: 'రాజా సాబ్' కంటే 8 రెట్లు ఎక్కువ... ప్రభాస్‌ హారర్ కామెడీ కలెక్షన్లపై మెగా డామినేషన్... 9వ రోజు ఇండియా నెట్ ఎంతంటే?

వీడియోలు షేర్ చేసిన రెహమాన్ కుమారుడు

ఎ.ఆర్. రెహమాన్ కుమారుడు అమీన్ సోషల్ మీడియాలో తన తండ్రికి మద్దతుగా ఎ.ఆర్. రెహమాన్ దేశాన్ని ఎన్నిసార్లు గర్వపడేలా చేశారో రాశారు. ఎ.ఆర్. రెహమాన్ కుమార్తె రహీమా, ఖతీజా కూడా పాత వీడియోలను షేర్ చేశారు. ఒక ఫోటోలో ఎ.ఆర్. రెహమాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఉన్నారు. ఇందులో ఎ.ఆర్. రెహమాన్ జాతీయ అవార్డును అందుకుంటున్నారు.

Also Read: Cheekatilo OTT: ప్రైమ్ వీడియోలో లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్... 'చీకటిలో' స్టోరీ, రన్‌ టైమ్ to నటీనటుల వరకు - శోభితా ధూళిపాళ సినిమా విశేషాలు

ఒక వీడియోలో ఎ.ఆర్. రెహమాన్ కోల్డ్‌ ప్లే కి చెందిన క్రిస్ మార్టిన్‌తో కలిసి ప్రదర్శన ఇస్తున్నన్నారు. మరొక వీడియోలో ఎ.ఆర్. రెహమాన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ''ఎ.ఆర్. రెహమాన్ సంగీతం లేదా ఎస్.ఎస్. రాజమౌళి కథ చెప్పే కళ అయినా ఇది భారతీయ సంస్కృతి స్వరంగా మారింది'' అని అన్నారు. ఎ.ఆర్. రెహమాన్ తన ఇంటర్వ్యూలో 'ఛావా' సినిమా ప్రజల మధ్య విభజన తీసుకు వచ్చే విధంగా ఉంటుందని అన్నారు. ఆయన బాలీవుడ్‌లో అధికార మార్పు, మతతత్వంపై స్పందించారు. గత 8 సంవత్సరాలలో బాలీవుడ్‌లో తనకు తక్కువ సినిమాలు వచ్చాయని కూడా అన్నారు.

Also ReadSiva Balaji Madhumitha : విడాకుల నుంచి వెనక్కి తగ్గిన శివబాలాజీ... ఎందుకు కలిసి ఉన్నామంటే?