AR Murugadoss Clarifies About Ghajini 2 Movie: సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెరకెక్కించిన మూవీ 'గజిని' (Ghajini). డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. 2005లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇదే చిత్రాన్ని 2008లో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ ఉంటే బాగుంటుందని ఎప్పటి నుంచో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం కోరుకుంటున్నారు. 


స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా..?


తాజాగా 'గజిని 2'పై దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్పందించారు. త్వరలోనే సీక్వెల్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కథకు సంబంధించి తన వద్ద ఓ ఆలోచన ఉన్నట్లు తెలిపారు. 'గజిని 2 రూపొందించే ఛాన్స్ ఉంది. సీక్వెల్‌కు సంబంధించి మా వద్ద ఓ ఆలోచన ఉంది. దానిపై ఇంకా వర్క్ చేయాల్సి ఉంది. మేము అనుకున్నట్లుగా అంతా మంచిగా జరిగితే సీక్వెల్ తెరకెక్కిస్తాం. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందిస్తాం.' అని ఆయన అన్నారు. 'గజిని'లో హీరో రోల్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందని.. ఆ పాత్రను ఆధారంగా చేసుకుని ఎన్ని పార్ట్స్ అయినా క్రియేట్ చెయ్యొచ్చని అభిప్రాయపడ్డారు. 


Also Read: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి


మరోవైపు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'సికిందర్'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ నెల 30న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది యాక్షన్ మూవీ అయినప్పటికీ ఇందులో భార్యాభర్తల సంబంధం గురించి వివరించినట్లు మురుగదాస్ తెలిపారు.