Dhanush In APJ Abdul Kalam Biopic: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండి తెరపై రానుంది. 'కలాం' రోల్‌లో కోలీవుడ్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించనున్నారు. ఈ మేరకు 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 

డైరెక్టర్ ఎవరంటే?

అబ్దుల్ కలాంగా ధనుష్ (Dhanush).. 'కలాం' టైటిల్‌తో ఈ మూవీని 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్', 'ఆదిపురుష్' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) రూపొందిస్తున్నారు. ఈ మేరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. కలాం సిల్హౌట్‌తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించారు. ఇది కలాం భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని సూచిస్తుంది. 'రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఓ లెజెండ్ ప్రయాణం ప్రారంభం అవుతుంది. భారతదేశ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి వస్తున్నారు. పెద్దగా కలలు కనండి. మరింత ఎత్తుకు ఎదగండి.' అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Also Read: చిరు ‘గ్యాంగ్ లీడర్’, పవన్ ‘వకీల్ సాబ్’ TO ఎన్టీఆర్ ‘కంత్రీ’, సూర్య ‘24’ వరకు- ఈ గురువారం (మే 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

యూత్‌కు స్ఫూర్తినిచ్చే స్టోరీ

నిజమైన రాజనీతిజ్ఞులు కరువైన ఈ కాలంలో కలాం గారు రాజకీయాలకు అతీతంగా నిలిచారని డైరెక్టర్ ఓం రౌత్ అన్నారు. 'విద్య, నైపుణ్యం, స్వదేశీ ఆవిష్కరణల శక్తికి ఆయన ప్రతీక. ఆయన స్టోరీని తెరపైకి తీసుకురావడం ఓ కళాత్మక సవాల్. నైతిక, సాంస్కృతిక బాధ్యత. ఇది ప్రపంచ యువతకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ యువతకు స్ఫూర్తినిచ్చే స్టోరీ. ఇది నా లైఫ్‌లో అత్యంత ముఖ్యమైన అనుభవం. ఆయన జీవితం ఓ పాఠం. అది ఎవరైనా, ఎక్కడివారైనా కనెక్ట్ అవుతుంది.' అంటూ ఓం రౌత్ చెప్పారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా లెవల్‌లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ - సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్ల కింద అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

'కలాం' లుక్ కోసం..

అబ్దుల్ కలాం లుక్ కోసం ఫిజికల్‌గా బాడీ ట్రాన్స్‌ఫర్‌మిషన్ అయ్యారు ధనుష్. కలాం బయోపిక్‌లో ప్రస్తుతానికి ఆయన పేరు మాత్రమే రివీల్ చేయగా.. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ టీం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.