Attitude Star Chandrahass : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?
Barabar Premistha Controversy : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మాదాపూర్ పీఎస్‌లో ఓ కేసు నమోదు కాగా... కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది.

Another Case On Attitude Star Chandrahass Due To Gunji Gunji Song Controversy : బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు, యంగ్ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్ట్ ఫిర్యాదుతో ఇప్పటికే అతనిపై ఓ కేసు ఫైల్ కాగా... తాజాగా ఓ కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు మరో కేసు నమోదైంది.
'లాంగ్వేజ్ సరికాదు'
చంద్రహాస్ హీరోగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై 'గుంజి గుంజి...' అంటూ అతను పాట పాడిన సంగతి తెలిసిందే. పాటలో బూతులు వాడగా... స్టేజ్‌పై చంద్రహాస్ వాడిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పీఎస్ కానిస్టేబుల్ నితీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు. అటు, మాధాపూర్ పీఎస్‌లోనూ ఆయనపై కేసు నమోదైంది.
Also Read : బన్నీ మూవీలో నేషనల్ క్రష్! - సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులో ఆమె రోల్ ఏంటో తెలుసా?
అసలేంటీ కాంట్రవర్సీ?
ఫస్ట్ మూవీ ఈవెంట్‌లోనే యాటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ రెండో మూవీ 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గుంజి గుంజి అంటూ బూతు పదాలతో పాట పాడాడు. నిజానికి మూవీలో అలాంటి లిరిక్స్ లేకున్నా కేవలం ప్రమోషన్స్ కోసం అలా లిరిక్స్ మార్చి పాడాడు. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ సాగింది. బూతు పదాలు వాడడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. గత రెండు రోజులుగా నెట్టింట ఎక్కడ చూసిన చంద్రహాస్ పేరు మార్మోగిపోయింది. అయితే, చంద్రహాస్‌ను విమర్శిస్తూ ఓ సీనియర్ జర్నలిస్ట్ వీడియో కూడా రిలీజ్ చేశారు.
వెనక్కి తగ్గని 'యాటిట్యూడ్' స్టార్
ఇంత కాంట్రవర్సీ అవుతున్నా కూడా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో సారీ చెప్పనని... తనపై ఎంతో ట్రోలింగ్ సాగిందని అప్పుడు వీరంతా ఏమైపోయారంటూ వీడియో రిలీజ్ చేశాడు. జర్నలిస్ట్ వీడియోపై రియాక్ట్ అయిన అతను... 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేకుంటే తానేం చేయాలో అదే చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో చంద్రహాస్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ సదరు జర్నలిస్ట్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చంద్రహాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, తాజాగా కానిస్టేబుల్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పీఎస్‌లోనూ కేసు నమోదైంది.
వివాదానికి చెక్ ఎప్పుడు?
ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాదం తర్వాత దీనిపై జేడీ స్పందించారు. ఈ పాట పాడినప్పుడు ఆ కార్యక్రమం నుంచి లేచి వెళ్లిపోవాలనిపించిందంటూ చెప్పారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా చేయాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రమోషన్స్ కోసం ఇలా పని కట్టుకుని మరీ బూతు సాంగ్ క్రియేట్ చేయడం సరి కాదన్నది చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయం.
ఇంతకు ముందు సినిమాల్లో స్టోరీ అవసరాన్ని బట్టి కొందరు బూతులు వాడినా వాటిని సౌండ్‌తో హైడ్ చేశారని అంటున్నారు. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కాస్త వెనక్కు తగ్గి సారీ చెబితే ఈ వివాదానికి చెక్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
























