Karthi's Annagaru Vostaru Telugu Teaser Out : తమిళ స్టార్ హీరో కార్తీ రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వా వాతియార్'. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా... తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా... రీసెంట్‌గానే స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. 

Continues below advertisement


వెరైటీగా టీజర్


ఈ మూవీ టైటిల్ మాత్రమే కాకుండా టీజర్ సైతం వెరైటీగానే ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా శుక్రవారం టీజర్ రిలీజ్ చేసి మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎంట్రీతోనే కార్తీ అదరగొట్టేశారు. పోలీస్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకునే క్రమంలో ఆయనకు గ్రాండ్ వెల్ కం చెబుతూ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. 


పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ స్టైలిష్ లుక్‌లో కార్తీ అదరగొట్టేశారు. హీరో రోల్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. టీజర్ డిఫరెంట్‌గా ఉందని... కార్తీ మూవీ స్టోరీ అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 



Also Read : పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ - ఆ కామెంట్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రియాక్షన్


ఈ మూవీకి నలన్ కుమార స్వామి దర్శకత్వం వహించగా... కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరితో పాటే సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబర్ 5న తమిళ వెర్షన్ రిలీజ్ కానుండగా... తెలుగులో అదే రోజున ఉంటుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.