Anaswara Rajan: తెలుగులో 'ఛాంపియన్' అనశ్వరకు మరో సినిమా... సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో!
Anaswara Rajan New Telugu Movie: 'ఛాంపియన్'తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అనశ్వర రాజన్. 'విత్ లవ్'తో హిట్ కొట్టింది. ఇప్పుడు ఆమెకు మరో తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చింది.

Anaswara Rajan bags one more Telugu movie after With Love success: తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువత మనసు దోచిన యంగ్ & లేటెస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే అనశ్వర రాజన్ అని చెప్పాలి. రోషన్ మేక 'ఛాంపియన్'తో ఆ అమ్మాయి తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అయ్యింది. అంతకు ముందు 'రేఖాచిత్రం'తో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలతో కొంత మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడీ అమ్మాయికి మరో తెలుగు సినిమా ఛాన్స్ వచ్చింది.
సంగీత్ శోభన్ సరసన అనశ్వర రాజన్!
Sangeeth Shobhan and Anaswara Rajan Pair Up for a Telugu Movie: 'మ్యాడ్' ఫ్రాంచైజీతో ప్రేక్షకులను నవ్వించిన యంగ్ హీరో సంగీత్ శోభన్. అంతకు ముందు ఓటీటీలో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్ ద్వారా హిట్ అందుకున్నారు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో హారర్ కామెడీ 'రాకాస' చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సినిమా కూడా లాక్ చేశారు సంగీత్ శోభన్.
View this post on Instagram
సుకుమార్ శిష్యుడు, 'కుమారి 21 ఎఫ్' వంటి విజయవంతమైన సినిమా తీసిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సంగీత్ శోభన్ హీరోగా ఓ సినిమా ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేయనున్నారు. రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్'తో పాటు కొన్ని హిట్ సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేశారు.
View this post on Instagram
సంగీత్ శోభన్ హీరోగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేయనున్న సినిమాలో కథానాయికగా అనశ్వర రాజన్ ఎంపిక అయ్యారని తెలిసింది. తెలుగులో ఆమె మూడో చిత్రమిది. 'ఛాంపియన్' తర్వాత 'ఇట్లు అర్జున' అని ఓ సినిమా చేశారు. అది ఇంకా విడుదల కాలేదు. దాని తర్వాత సంగీత్ శోభన్ సినిమా ఓకే చేశారు. తెలుగు యువతలో అనశ్వర రాజన్ మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు లేటెస్ట్ క్రష్ అని ట్యాగ్ అందుకున్నారు. ఆవిడకు మరిన్ని తెలుగు సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.























