Anasuya Reaction Over Sanatana Dharma Comments : ప్రముఖ యాంకర్, నటి అనసూయ... సనాతన ధర్మం, హిందూ మతంపై రీసెంట్‌గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. కొందరు ఆమె కామెంట్స్‌ను తప్పుబడుతూ విమర్శలు చేయగా... తాజాగా ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చారు అనసూయ. సోషల్ మీడియా పోస్టులో సుదీర్ఘ వివరణ రాసుకొచ్చారు.
'నా మాటలు వక్రీకరించారు'
తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని తెలిపారు అనసూయ. 'నా కామెంట్స్‌కు సంబంధించి పూర్తి వీడియో చూడకుండా సగం సగం ఎడిట్ చేసిన క్లిప్పుల ఆధారంగా నాపై విమర్శలు చేయడం సరికాదు. నేను మాట్లాడింది ఓ సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాత్రమే. నన్ను లేదా ఇంకెవరిపై అయినా వల్గర్ కామెంట్స్ చేస్తూ పర్సనల్ అటాక్స్ చేస్తూ బెదిరింపులకు దిగే వారి గురించి మాత్రమే మాట్లాడా. అది ఏ మతాన్ని ఓ వర్గాన్ని ఏ నమ్మకాన్నీ టార్గెట్ చేస్తూ చెప్పిన మాట కాదు.
నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను. హిందునని చెప్పుకోవడానికి గర్వపడతా. నా ధర్మం, నా నమ్మకం నా వాల్యూస్ గురించి నాకు ఎలాంటి అపాలజీ అవసరం లేదు. నాకు ధైర్యంగా ఉండడం సనాతన ధర్మం నేర్పింది. అదే సమయంలో ఎదుటివారిని మనిషిగా గౌరవించడం నేర్పింది.' అని తెలిపారు.
హనుమాన్ జీ కుమార్తెను...
తనను తాను హనుమాన్ జీ కుమార్తెగా భావిస్తానని తెలిపారు అనసూయ. 'హనుమంతుడి భక్తి, ధైర్యం, బలం నాకు ఎప్పటికీ ఇన్‌స్పిరేషన్. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండడం నా నేచర్ కాదు. నా మాటలను వక్రీకరించి 'హిందూయిజం అవమానించింది', 'సనాతన ధర్మంని అవమానించింది' అంటూ చిత్రీకరించడం చాలా తప్పు.
నేను అబ్యూస్ చేసే వాళ్లను మాత్రమే ప్రశ్నించా. సోషల్ మీడియాలో వైరలయ్యే ఎడిటెడ్ వీడియోస్, అసంపూర్ణ సమాచారాన్ని చూసి ఓ నిర్ణయానికి రావొద్దు. ఏం చెప్పానే ఏ సందర్భంలో చెప్పానే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఓ ఒపీనియన్‌కు రండి. నా నమ్మకం మీద నాకు గర్వం ఉంది. నేను హిందువునని చెప్పుకోవడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. జై శ్రీరామ్ జై హనుమాన్.' అంటూ రాసుకొచ్చారు. హిందూ ధర్మంపై తన కామెంట్స్ కావాలనే వక్రీకరించారంటూ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు.
