James Van Der Beek Death: క్యాన్సర్‌తో 48 ఏళ్లకు హాలీవుడ్ నటుడు మృతి... 'డాసన్ క్రీక్' స్టార్ జేమ్స్ వాన్ డెర్ బీక్ ఇకలేరు
James Van Der Beek Death Reason: హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు జేమ్స్ వాన్ డెర్ బీక్ 48 ఏళ్ల వయసులో మరణించారు. క్యాన్సర్ తో పోరాటంలో ఆయన ఓడిపోయారు.

అమెరికన్ టీవీ సిరీస్ 'డాసన్ క్రీక్' ద్వారా పేరు తెచ్చుకున్న నటుడు జేమ్స్ వాన్ డెర్ బీక్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. కొలోరెక్టల్ క్యాన్సర్ తో కొన్ని రోజులుగా ఆయన పోరాడుతున్నారు. ఆయన మరణంతో అభిమానులు, సెలబ్రిటీలు దిగ్భ్రాంతికి గురయ్యారు మరియు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జేమ్స్ వాన్ డెర్ బీక్ మరణాన్ని ధృవీకరించిన కుటుంబ సభ్యులు
జేమ్స్ వాన్ డెర్ బీక్ కుటుంబం అతని ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసింది. అందులో అతని మరణాన్ని ధృవీకరించింది. "మా ప్రియమైన జేమ్స్ డేవిడ్ వాన్ డెర్ బీక్ ఈ ఉదయం కన్ను మూశారు. అతను తన చివరి రోజులను ధైర్యంతో గడిపాడు. అతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ప్రస్తుతానికి మా ప్రియమైన భర్త, తండ్రి, కుమారుడు, సోదరుడు, స్నేహితుడిని కోల్పోయిన దుఃఖంలో మేం పూర్తి గోప్యతను కోరుకుంటున్నాము" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
View this post on Instagram
సంతాపం తెలుపుతున్న హాలీవుడ్ సెలబ్రిటీలు
జేమ్స్ వాన్ డెర్ బీక్ పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే... చాలా మంది అమెరికన్ టీవీ స్టార్లు, హాలీవుడ్ నటులు వాన్ డెర్ బీక్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. సారా మిచెల్ గెల్లర్ "మీ కుటుంబం గురించి నాకు చాలా బాధగా ఉంది. జేమ్స్ వారసత్వం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి మాత్రమే కాదు... ప్రపంచానికి కూడా చాలా పెద్ద నష్టం. క్యాన్సర్ నరకానికి పో" అని రాశారు. జెనిఫర్ గార్నర్ "ఇది ఎంతో బాధాకరం. తీరని నష్టం. మీకు, మీ పిల్లలకు ఈ కష్ట సమయంలో దేవుడు చాలా ప్రేమను ఇవ్వాలి" అని పోస్ట్ చేశారు.
వాన్ డెర్ బీక్ కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. తనకు క్యాన్సర్ అని 2024లో ప్రకటించాడు. అతని కెరీర్ విషయానికి వస్తే... జేమ్స్ వాన్ డెర్ బీక్ 1998 - 2003 టీన్ డ్రామా 'డాసన్స్'లో ప్రధాన పాత్ర పోషించించారు. దాంతో బాగా గుర్తింపు వచ్చింది. 'వర్సిటీ బ్లూస్', 'ది రూల్స్ ఆఫ్ అట్రాక్షన్' చిత్రాలలో కూడా నటించాడు. అయితే... సినిమా రంగంలో ఎప్పుడూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఎందుకంటే 'డాసన్ క్రీక్' ఇమేజ్ నుంచి బయట పడటం అతనికి కష్టమైంది.























