Allu Sirish Nayanika Marriage Date Officially Confirmed : వచ్చే ఏడాది అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు అల్లు శిరీష్ తన పెళ్లి డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.
స్పెషల్ ఫన్ వీడియోతో...
ఓ స్పెషల్ ఫన్ వీడియోతో తన పెళ్లి డేట్ అనౌన్స్ చేశారు అల్లు శిరీష్. 'బాబాయ్ మీ పెళ్లి ఎప్పుడు?' అంటూ బన్నీ పిల్లలు ఆయన్ను ప్రశ్నించగా... మార్చి 6, 2026 అంటూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే, 'సంగీత్ ఎప్పుడు?' అంటూ ప్రశ్నించగా... 'మనం సౌత్ ఇండియన్స్ కదా. సంగీత్ లాంటివి చెయ్యం.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు లవ్ సింబల్స్‌తో కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఇక అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం కూడా 2011, మార్చి 6నే జరిగింది. అన్న పెళ్లి రోజునే తమ్ముడి పెళ్లి కూడా జరగబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 10 కోట్లు దాటేసిన రోషన్ 'ఛాంపియన్' - నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?
శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ అక్టోబరులో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వరుణ్ తేజ్, లావణ్యల వివాహ సమయంలో... యంగ్ హీరో నితిన్, షాలిని దంపతులు వారి కోసం పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి షాలిన తన ప్రాణ స్నేహితురాలు నయనికను ఆహ్వానించారు. ఆ వేడుకలో నయనికను అల్లు శిరీష్ ఫస్ట్ టైం కలిశారు. అలా ఆమెతో లవ్‌లో పడ్డారు. రెండేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.
