Tollywood Political PR Wars: "నీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, అంతేకానీ వాళ్లను హేట్ చేయడం లేదా ట్రోల్ చేయడం సరికాదు. మనకు నచ్చని వారి కోసం మన డబ్బును, ఎనర్జీని ఎందుకు ఖర్చు పెట్టాలి?" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్‌లో సందేశం ఇచ్చారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలు, ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా . ఈ వ్యాఖ్యలు కేవలం సామాన్య నెటిజన్లకు మాత్రమే కాకుండా, తెరవెనుక నడుస్తున్న డిజిటల్ రాజకీయంపై వేసిన నేరుగా చేసిన కామెంట్స్ గానే చూడవచ్చు.
ఇతరులను ట్రోల్ చేసి సమయం వృధా చేసుకోవద్దని సలహా నేడు సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ దాడి లేదా ట్రోలింగ్ అనేది కేవలం వ్యక్తిగత ద్వేషంతో అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదు. రాజకీయ పార్టీలు, హీరోలు, వాటి అనుబంధ డిజిటల్ పిఆర్ ఏజెన్సీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నడిపిస్తున్న ఒక పెద్ద వ్యూహాత్మక నెట్‌వర్క్ అన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల సమయం నుండి ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకులను మానసికంగా దెబ్బతీయడానికి ట్రోల్ సైన్యాలను రంగంలోకి దించారు. మనకు నచ్చని వారి కోసం డబ్బు, ఎనర్జీ ఎందుకు ఖర్చు పెట్టడం అని బన్నీ అనడం వెనుక.. రాజకీయ ప్రయోజనాల కోసం తనను టార్గెట్ చేస్తూ పెయిడ్ క్యాంపెయిన్లు నడుపుతున్న ఏజెన్సీలను, వాటికి నిధులు సమకూరుస్తున్న రాజకీయ శక్తులను ఎండగట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని అనుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు మిత్రుడి ఇంటికి వెళ్లినప్పటి నుండి ట్రోల్స్
అల్లు అర్జున్ తన వ్యక్తిగత నిర్ణయాల్లో సాంప్రదాయ మెగా చట్రాన్ని దాటి సొంత గుర్తింపును చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యక్తిగత స్నేహాలకు విలువ ఇస్తారు. గతంలో వైసీపీ నేత నంద్యాల నుంచి పోటీ చేస్తూంటే ఆయన తన మిత్రుడుకాబట్టి ఆయన ఇంటికి వెళ్లారు. అది వివాదాస్పదం అయిది. త ఎన్నికల సమయంలో నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతుగా వెళ్లిన ఉదంతం నుండి, తదనంతర పరిణామాల వరకు.. ఆయనను పొలిటికల్ రీజన్స్‌తో దెబ్బతీయడానికి సోషల్మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. సినిమా రంగాన్ని, రాజకీయ ప్రయోజనాలను ముడిపెట్టి, డిజిటల్ వేదికలపై అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించిన రాజకీయ వర్గాలకు తన సైలెంట్ కౌంటర్ ద్వారా అల్లు అర్జున్ గట్టి సందేశాన్ని పంపారని అంటున్నారు.
ఎనర్జీని కుటుంబం కోసం వెచ్చించాలని అల్లు అర్జున్ సలహా
సాధారణంగా ఫ్యాన్ వార్స్ లేదా పొలిటికల్ క్యాంపెయిన్లలో నష్టపోయేది నిరుద్యోగులైన యువత , అభిమానులే. పొలిటికల్ పార్టీలు తమ ప్రయోజనాల కోసం యువతలోని ఆవేశాన్ని వాడుకుంటూ, వారి సమయాన్ని, శక్తిని ద్వేషాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నాయి. మనకున్న 100 శాతం ఛార్జింగ్‌ను మన ఎదుగుదల కోసం వాడుకుందాం అని తన అభిమానులకు అర్జున్ చెప్పిన మాటలు.. ప్రచారాల వలలో చిక్కుకుని విలువైన సమయాన్ని పాడుచేసుకుంటున్న యువతకు ఒక హెచ్చరిక లాంటివి. రాజకీయ నాయకుల లేదా పార్టీల ప్రాపగండాకు బలై, సోషల్ మీడియాలో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన చేసిన విజ్ఞప్తి ఒక అవసరాన్ని ఎత్తిచూపుతోంది. మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఫ్యాన్స్ మీట్ లో చెప్పిన పంచ్ డైలాగ్ మాత్రమే కాదు; అది నేటి సోషల్ మీడియా పొలిటికల్ కల్చర్ పై చేసిన తీవ్రమైన వ్యాఖ్య. డిజిటల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌లకు, పిఆర్ నెట్‌వర్క్‌లకు ప్రజాదరణ పొందిన ఒక స్టార్ ఇచ్చిన బలమైన పరోక్ష సమాధానం ఇది. అనుకోవచ్చు.
