ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హీరో సినిమాలు చేయబోతున్నారా? తమిళ దర్శకుడు అట్లీతో ప్రస్తుతం ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజ్ చేసిన‌ ప్రీ ప్రొడక్షన్ వీడియోలు చూస్తే అదొక ఫాంటసీ సూపర్ హీరో ఫిలిం అనే సంగతి అర్థం అవుతోంది. దాని తర్వాత కూడా మరొక సూపర్ హీరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

'శక్తిమాన్'గా అల్లు అర్జున్?బసిల్ జోసెఫ్ ఏం ప్లాన్ చేశారు?మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్‌ (Basil Joseph)తో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన మాలీవుడ్ డైరెక్టర్... బన్నీకి కథ చెప్పడంతో పాటు సినిమా గురించి డిస్కస్ చేసి వెళ్లారట. అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అతనిదేనని ఫిలింనగర్ వర్గాలలో వినబడుతుంది. 

అల్లు అర్జున్ - బసిల్ జోసెఫ్ సినిమా గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఈ సినిమాలో హీరో శక్తిమాన్ కింద కనిపించనున్నారట. దాంతో అభిమానులలో మలయాళ దర్శకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు అనే ఆసక్తి మరింత పెరిగింది. 

ఆల్రెడీ సూపర్ హీరో సినిమా డీల్ చేసిన అనుభవం ‌బసిల్ జోసెఫ్‌కు ఉంది. మలయాళంలో టోవినో థామస్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'మిన్నల్ మురళి' భాషలకు అతీతంగా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి సూపర్ హీరో కథతో డైరెక్షన్ చేయడానికి బసిల్ జోసెఫ్ రెడీ అయ్యారన్నమాట.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?

త్రివిక్రమ్ సినిమా లేనట్టే...ఎన్టీఆర్ దగ్గరకు అల్లు అర్జున్ కథ!అట్లీ సినిమాకు ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఐకాన్ స్టార్ కోసం మైథాలజీ కథను ప్రిపేర్ చేశారు త్రివిక్రమ్. ఆ కథతో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడానికి మాటలు మాంత్రికుడు రెడీ అయ్యారు. అదే ఎన్టీఆర్ సినిమా కంటే ముందు విక్టరీ వెంకటేష్ హీరోగా మరొక సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సలహాలు చేస్తున్నారు.

Also Read'డీడీ నెక్స్ట్ లెవెల్' రివ్యూ: Zee5 ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ కామెడీ... రివ్యూ రైటర్లను టార్గెట్ చేసే దెయ్యం... సంతానం సినిమా ఎలా ఉందంటే?