కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మారుతుందని, శత్రువులు మిత్రులు అవుతారని సోషల్ మీడియాలో బోలెడు పోస్టులు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy Telangana CM), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటోలు. ఆ పోస్టులకు కారణం అల్లు సినిమాస్ ఓపెనింగ్. అసలు వివరాల్లోకి వెళితే...

హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలిఅల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ కట్టిన సంగతి తెలిసిందే. మార్చి 12, గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ థియేటర్లు ఓపెన్ అయ్యాయ్. ఆ  కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రిగా హాజరు అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ కూడా వేదికపై ఉన్నారు. ఈ తరుణంలో 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వంటివి కొందరు గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పడ్డాయి. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ పోస్టులు పడ్డాయి. అదీ తేడా!

Also Read: Harsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

అల్లు సినిమాస్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాన్ ఇండియా లెవల్ కాదని, పాన్ వరల్డ్ (హాలీవుడ్)లోనూ అల్లు అర్జున్ రాణించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అల్లు సినిమాస్ ప్రారంభించిన అనంతరం గొప్ప టెక్నాలజీతో కూడిన స్క్రీన్లను హైదరాబాద్ నగరానికి తీసుకు వచ్చిన అల్లు కుటుంబాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. 

Also Read: Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

భారతదేశంలో సాంకేతికంగా సినిమా ఎంతో అభివృద్ధి చెందుతోందని, 'అరుంధతి' - 'బాహుబలి' వంటి సినిమాలను ఉన్నత స్థాయిలో తెరకెక్కించారని, టెక్నాలజీ పరంగా ఎంతో ఉన్నతంగా సినిమా తీసినప్పటికీ అందుకు తగ్గ స్క్రీన్లు లేకపోతే వృథా అని, డాల్బీ విజన్ ఉన్న స్క్రీన్లలో సినిమా చూస్తే వచ్చే అనుభూతి వేరు అని రేవంత్ రెడ్డి చెప్పారు. టికెట్ కొని సినిమాను జడ్జ్ చేయడం సులభం అని, కానీ సినిమా తీయడం కష్టమని ఆయన అన్నారు.

Also Readస్టార్ హీరోలైనా వీళ్ళిద్దరూ చెప్పింది చేయాల్సిందే... పూరి ఛాన్స్‌తో టాప్ ప్లేసుకు, ఈ అన్నదమ్ములు ఎవరో తెలుసా?