ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'రాకా' (Raaka Movie). ప్రజెంట్ పాన్ ఇండియా ఫిలిమ్స్ ట్రెండ్‌లో ఈ సినిమా కూడా చేరనుందని సమాచారం. ఒక్కటిగా కాకుండా రెండు పార్టుల్లో విడుదల కానుంది. 

Continues below advertisement

'రాకా'... ఒకటి కాదు, రెండు భాగాలుగా!Raaka To Release In Two Parts: ఇప్పుడు 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం. నిజానికి మొదట ఈ సినిమాను ఒక్క భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... కథ పరిధి చాలా పెద్దది కావడంతో పాటు భారీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు భాగాలుగా విడుదల చేస్తే బావుంటుందని దర్శకుడు అట్లీ ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారు. 

'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అనేది తన బృందంతో చర్చించిన దర్శకుడు అట్లీ... ఆ తర్వాత రెండు పార్టుల ఐడియాను అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ముందు ఉంచారట. ఆ ఇద్దరూ ఇటీవలే దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారని జరిగింది.

Continues below advertisement

Also ReadAllu Arjun On Trolls - వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్

ప్రస్తుతం 'రాకా' షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. ఈ ఏడాది (2026) చివరికి సినిమా షూట్ అంతా, రెండు భాగాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమా ఓటీటీ రైట్స్ ఇంకా అమ్మలేదు. డిజిటల్ రైట్స్ విషయంలో భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ... దర్శక నిర్మాతలు ఆశించిన స్థాయిలో లేవట.

Also ReadJana Nayagan Six Days Box Office Collections - విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

'రాకా' ప్రజెంట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరూ ఉండరని టాక్. 'రాకా'లో కథానాయికగా దీపికా పదుకోన్ పేరును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె కాకుండా రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారని సమాచారం. వాళ్ళ పేర్లను అధికారికంగా వెల్లడించలేదు.

Also ReadChennai Love Story Five Days Collection - వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?