Allu Arjun's Raaka First Glimpse Release Date Fixed : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబో పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ 'రాకా' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
రెండు రోజుల క్రితం 37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. దాన్ని డీకోడ్ చేస్తే ఈ నెల 21న అంటే అట్లీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్‌పై చూడని... హాలీవుడ్ రేంజ్ అవతార్‌ను మించిపోయేలా విజువల్స్ చూపించనున్నట్లు... ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగానే ఓ స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చేశారు.
'అవతార్‌లో లేని విజువల్స్'
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి రాకా గ్లింప్స్‌పై తాజాగా చేసిన కామెంట్స్ పదింతల హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయమని తెలిపారు. రీసెంట్‌గా ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
'అట్లీ సర్ నాకు సినిమాకు సంబంధించి కొన్ని విజువల్స్ ఫుటేజెస్ చూపించారు. నిజం చెప్తున్నా. హాలీవుడ్ మూవీ అవతార్‌లో కూడా నేను అలాంటి విజువల్స్ చూడలేదు. మరో 3 రోజుల్లో మీరూ చూస్తారు. రాజమౌళి సర్ ఇండియన్ సినిమాను ఏ రకంగా గ్లోబల్ వేదికపై నిలబెట్టారో... అట్లీ సర్ కూడా రాకా మూవీతో మన సినిమాను వరల్డ్ మ్యాప్‌పై నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారు. మరో 3 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గ్రాండియర్ ఏంటో సొంతంగా చూడబోతున్నారు.' అని తెలిపారు.
ఈ సినిమాలో బన్నీ ఓ వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పగలు మనిషిగా రాత్రి తోడేలుగా చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా కనిపించబోతున్నారని టాక్. అంతే కాకుండా బన్నీ మూడు రోల్స్‌లో నటించనున్నట్లు సమాచారం.
ఇక, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలకపాత్ర పోషిస్తుండగా... జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రష్మిక నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సైన్స్ ఫిక్షన్‌కు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. షూటింగ్‌తో VFX వర్క్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు గ్రాఫిక్స్ కోసం వర్క్ చేస్తున్నాయి. 2028 ప్రారంభంలో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
