Allu Arjun's Pushpa 2 The Rule Movie To Release In Japan : 'పుష్ప'గాడి క్రేజ్ ఇకపై జపాన్‌లోనూ మనం చూడబోతున్నాం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప' ఫ్రాంచైజీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను సైతం అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 'తగ్గేదేలే' అంటూ జపనీస్‌లోనూ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

జపాన్‌లో వచ్చే ఏడాది జనవరి 16న అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది. బన్నీ ఎంట్రీ ఫైట్ సీన్‌తో పాటు 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా' అంటూ పుష్ప మేనరిజంలో చెప్పే డైలాగ్, 'పార్టీ ఉంది పుష్ప' అంటూ విలన్ షెకావత్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

Also Read : 'అఖండ 2' నిర్మాతలకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్... విడుదలకు ముందు వివాదం!

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన 'పుష్ప'కు సీక్వెల్‌గా 'పుష్ప 2' తెరకెక్కింది. 2024, డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1,831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో నటించారు. వీరితో పాటే రావు రమేష్, ఫహాద్ ఫాజిల్, జగదీష్ బండారీ, సునీల్, అనసూయ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మూవీని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ,  వై రవిశంకర్ నిర్మించారు. 'పుష్ప' సెకండ్ పార్ట్ రిలీజై గురువారానికి ఏడాది పూర్తైన సందర్భంగా హైదరాబాద్‌లో విమల్ థియేటర్లో స్పెషల్ షోస్ వేయనున్నారు. వచ్చే ఏడాది మూవీ జపాన్‌లో రిలీజ్ కానుంది.