Lloyd Stevens Fitness Trainer For Allu Arjun: ఏ సినిమా అయినా అందులో రోల్‌కు తగ్గట్టు తన బాడీ స్టైల్ మార్చుకుంటారు అల్లు అర్జున్ (Allu Arjun). 'పుష్ప' సినిమాతో ఆయన ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. అంతకు ముందు ఆయన్ను స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. కెరీర్ తొలి నాళ్లలో కొన్ని విమర్శలు వచ్చినా.. వాటిని అధిగమించిన తనదైన స్టైల్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 

2007లో వచ్చిన 'దేశముదురు'లో సిక్స్ ప్యాక్‌తో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో క్యారెక్టర్‌కు తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ మార్చుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించారు. 'పుష్ప' మూవీ ఆయన్ను ఓ రేంజ్‌లోకి తీసుకెళ్లింది. ఈ మూవీలో గుబురు గెడ్డంతో మాస్ లుక్‌లో దాదాపు ఐదేళ్లు కనిపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బన్నీ అదే స్టైల్‌ను అలానే మెంటెయిన్ చేశారు. ఇప్పుడు తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీ మూవీ కోసం కొత్తగా న్యూ లుక్‌లో కనిపించబోతున్నారు.

ఎన్టీఆర్, మహేష్ బాబు ఫిట్‌నెస్ ట్రైనర్

కొత్త మూవీ కోసం మరింత స్టైల్‌గా కనిపించేందుకు బన్నీ.. ఫేమస్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా లాయిడ్ వెల్లడించారు. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో ఉన్న ఓ ఫోటోను పంచుకున్నారు. బన్నీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

దీంతో లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టీవెన్స్ రాకతో న్యూ లుక్ మరింత అదిరిపోతుందంటూ చెబుతున్నారు. లాయిడ్ స్టీవెన్స్‌కు టాలీవుడ్‌లో మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన స్టార్ హీరోస్ ఎన్టీఆర్, మహేష్ బాబులకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చారు.

Also Read: రవితేజ ‘ఈగల్’, మహేష్ ‘శ్రీమంతుడు’ టు బన్నీ ‘అల వైకుంఠపురములో’, నాని ‘దసరా’ వరకు - ఈ ఆదివారం (మే 4) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్..

న్యూ లుక్ అట్లీ మూవీలోదేనా..

'పుష్ప' నుంచి బయటకు వచ్చాక బన్నీ మళ్లీ స్టైలిష్‌గా మారారు. తాజాగా.. వేవ్స్ సమ్మిట్‌లో ఆయన లుక్ అదిరిపోయింది. ఇప్పటికే అట్లీ మూవీ కోసం బన్నీకి ఓసారి లుక్ టెస్ట్ కూడా జరిగింది. కొత్త సినిమాలో ఆయన ఎలాంటి లుక్‌లో కనిపిస్తారో క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఇదే లుక్ అయి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హై ఆక్టేన్ పాన్ ఇండియా మూవీ

అట్లీ, బన్నీ కొత్త మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఏప్రిల్ 8న ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. హై - ఆక్టేన్ పాన్ - ఇండియా ఫీచర్ ఫిల్మ్‌ నిర్మించబోతున్నామంటూ సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే వెల్లడించారు. ఈ మూవీని 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మూవీలో భారీ వీఎఫ్ఎక్స్ ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఇందుకోసం అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీతో మూవీ టీం పని చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఓ రోల్ కోసం మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్‌తో మూవీ ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. హాలీవుడ్ రేంజ్‌లో మూవీ ఉండనున్నట్లు తెలుస్తుండగా.. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడి కానున్నాయి.