Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
RJ Charmilla : చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ ఈవెంట్‌లో స్టేజ్‌పై యాంకర్‌కు అల్లు అరవింద్ మూవీ ఆఫర్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఆమె ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Allu Aravind Offers Heroine Chance To Anchor RJ Charmilla : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ లవ్ ఎంటర్టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ యాంకర్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'యాంకర్స్ కూడా హీరోయిన్‌లా ఉంటున్నారు. నెక్స్ట్ సినిమాలో చేస్తావా?.' అంటూ ఆమెను అడిగారు. దీంతో ఆమె ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆ క్వశ్చన్‌తో...
చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌ను ప్రముఖ యాంకర్ ఆర్జే చర్మీలా హోస్ట్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్‌ను ఆమె సరదాగా ఓ క్వశ్చన్ అడిగారు. 'సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఫస్ట్ లవ్ తోపేం కాదని... మీరేం అనుకుంటున్నారు. ఫస్ట్ లవ్ తోపా కాదా?' అంటూ సరదాగా అడగ్గా... 'తాను చిన్నప్పుడు లవ్ చేసే వయసులో చెన్నైలో ఉన్నాను. అక్కడే చదువుకున్నా. చెన్నై లవ్ స్టోరీ అంటే కనెక్ట్ అవుతుంది కదా.' అంటూ నవ్వేశారు.
ఆ తర్వాత యాంకర్ చర్మిల్లాను ఉద్దేశించి మాట్లాడిన అల్లు అరవింద్... 'ఈ మధ్య యాంకర్స్ కూడా హీరోయిన్స్‌లా అయిపోతే ఎలా?. వారు కూడా హీరోయిన్స్‌లానే కనిపిస్తున్నారు. నెక్స్ట్ సినిమాలో యాక్ట్ చేస్తావా?' అంటూ అడిగారు. ఈ వీడియో వైరల్ కాగా... ఆమె ఎవరా? అంటూ చాలా మంది నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆర్జేగా కెరీర్ స్టార్ట్ చేసిన చర్మిళ్ల రీసెంట్‌గానే యాంకర్‌గా మారారు. సినిమా ఈవెంట్స్ హోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Allu Aravind certified.
— +ve Vibez Only (@MekaSaiKrishna1) July 18, 2026
Great day for Charmilla fanses 🫡❤️ https://t.co/jLd5LNbwxn pic.twitter.com/NcSIOPmOoS
తమ మాట తీరు, చలాకీ తనంతో పాటు యాంకర్‌గా ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు చాలామంది యాంకర్స్. యాంకర్స్ సుమ, అనసూయ, శ్రీముఖి, స్రవంతి ఈ కోవకు చెందిన వారే. తొలుత యాంకర్స్‌గా టీవీ షోస్‌లో పాపులారిటీ సంపాదించుకుని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కిించుకున్నారు. స్టార్ హీరోస్ మూవీస్‌లో నటించారు. ఇప్పుడు చర్మిళ్ల కూడా త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















