Allari Naresh's Alcohol Release Date Locked : అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'ఆల్కహాల్' (Alcohol). ఈ ఏడాది జనవరి 1న రిలీజ్ కావాల్సిన సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీని డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నారు. 'ఫ్యామిలీ డ్రామా' మూవీ ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వం వహించగా... అల్లరి నరేష్ సరసన  రుహానీ శర్మ, నిహారిక ఎన్‌ఎం నటిస్తున్నారు.  గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్,  చైతన్య కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెహర్ తేజ్ దర్శకత్వం వహించగా... గిబ్రాన్ మ్యూజిక్ అందించారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. 

Continues below advertisement

మరోసారి కామెడీ జానర్‌లో...

వైవిధ్యమైన కథలు, విభిన్నమైన రోల్స్‌తో ఆకట్టుకునే అల్లరి నరేష్... మళ్లీ కామెడీ జానర్‌తో అలరించబోతున్నారు. 'ఆల్కహాల్' మూవీలో నరేష్ రిచ్చెస్ట్ పర్సన్‌గా కనిపించనున్నారు. ఆదాయం లక్షల్లో ఉన్నప్పటికీ ఆయనకు మద్యం తాగే అలవాటు ఉండదు. డ్రింకింగ్ తన మనసును కంట్రోల్ చేయడం తనకు ఇష్టం లేదని ఓ సందర్భంలో చెబుతారు. అయితే ఆయన ప్రవర్తన, చేసే పనులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.

మరోవైపు తన స్నేహితుల కోసం నరేష్ ఓ ఆల్కహాల్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పార్టీ వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉన్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తుంది. పార్టీలో పాల్గొన్న వారందరినీ చంపేస్తానని నరేష్ చెప్పడంతో సస్పెన్స్ నెలకొంటుంది. అసలు ఈ పార్టీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? గతంలో ఏదైనా సంఘటన జరిగిందా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 

Also Read : Baththa Movie OTT : ఓటీటీలో విజయ్ సేతుపతి కొత్త మూవీ రికార్డ్ - 48 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో బత్తా... ఎందుకు చూడాలంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.