'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది అలియా భట్ (Alia Bhatt). ఆమె నటించిన హిందీ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులు సైతం ఉన్నారు. ఇప్పుడు హిందీలో ఆలియా భట్ ఓ ఫిమేల్ యాక్షన్ సినిమా చేస్తోంది. అందులో శర్వరి మరొక మెయిన్ లీడ్. ఆ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  

జూలై 10న థియేటర్లలోకి 'ఆల్ఫా'ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థల్లో ఒకరైన య‌శ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై 'అల్ఫా' రూపొందుతోంది. ఈ సినిమాను జూలై 10న ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే...ఆలియా భట్ కొత్త లుక్, అదీ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తోంది. ముఖం మీద గాయాలు, గాట్లు వంటివి క‌నిపిస్తున్నాయి.

Also ReadPolena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న 'ఆల్ఫా'లో ఆలియా భ‌ట్‌, శ‌ర్వ‌రితో పాటు అనీల్ కపూర్‌, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్‌ను ఆలియా, శర్వరి ఢీ కొట్టే యాక్షన్ సీన్లు ఉన్నాయట. 

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

'ఆల్ఫా' కోసం మొదటిసారి య‌శ్‌ రాజ్ ఫిల్మ్స్‌, ఆలియా భట్ క‌లిశారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కుతోన్న ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ సినిమా 'అల్ఫా' అని నిర్మాణ సంస్థ చెబుతోంది. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ గ్లోబ‌ల్ హిట్ సిరీస్ 'ది రైల్వే మెన్‌'ను తెర‌కెక్కించిన శివ్ ర‌వైల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి ఆదిత్య చోప్రా నిర్మాత‌.

Also ReadShiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?