అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లెనిన్' (Lenin Telugu Movie). టాలీవుడ్ ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేశారు. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు.
జూన్ 30న 'లెనిన్' ట్రైలర్ విడుదలAkhil's Lenin Trailer Release Date: లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... 'లెనిన్' ట్రైలర్‌ను జూన్ 30న... అంటే మంగళవారం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది హైదరాబాద్ సిటీలో జరగనుంది. త్వరలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వెన్యూ, ఇంకా ఆ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: Maa Inti Bangaram Collections Day 9: సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే
'లెనిన్' సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. ఈ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ సూపర్ డూపర్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమాకు వీళ్ళిద్దరి పెయిర్ ప్లస్ అవుతుందని చెప్పడంలో మరొక సందేహం అవసరం లేదు.
Also Read: Sambarala Yeti Gattu - సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
'లెనిన్' నటీనటుల విషయానికి వస్తే... శివాజీ, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని, ఆయన మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ సినిమా ఫస్ట్ కాపీ చూసి నాగార్జున చేసిన ట్వీట్ సినిమాపై అంచనాలు పెంచింది.
