Akhil Akkineni's Lenin Movie Postponed : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ రూరర్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్'. మే 1న రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడింది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

'పెద్ది' రాకతో...

ఏప్రిల్ 30 రామ్ చరణ్ పెద్ది వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కానుండడంతో... లెనిన్ మూవీ జూన్ 26 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని... అందుకే తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. నిజానికి జూన్‌ 4న యశ్ టాక్సిక్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత 3 వారాలకు లెనిన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆ నెలలో పెద్ద మూవీస్ ఏమీ లేకపోవడంతో ఆ తేదీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Also Read : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే

ఈ మూవీకి 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేం మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా... అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, సాంగ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. శివాజీ కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఫస్ట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన హలో కాస్త పర్వాలేదనిపించింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మిస్టర్ మజ్ను, లాస్ట్‌గా ఏజెంట్ మూవీలో నటించారు. ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు. ఈసారి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో హిట్ కొట్టాలని అఖిల్ భావిస్తున్నారు.