తెలుగు సినిమాల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) అంటే ఓ బ్రాండ్. నటన, కామెడీ టైమింగ్‌తో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన అంటే ఎంతో ఇష్టం. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47' (AK47 Movie). ఇంతకు ముందు త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సినిమాల్లో వెంకటేష్ నటించారు. కానీ, ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

Continues below advertisement

దసరాకు 'ఏకే 47'... అక్టోబర్ 16న విడుదల?'ఏకే 47' సినిమాను దసరా పండుగ సీజన్‌లో విడుదల చేయాలని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు విడుదల తేదీని ఖరారు చేశారట. అక్టోబర్ 16న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Also Read: Balakrishna Birthday Special - రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్

Continues below advertisement

దసరాకు సెలవులు ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా థియేటర్లకు వస్తారు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం వల్ల సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా... లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ లభిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Bharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్‌లో విషాదం

వెంకటేష్ సరసన 'కేజీఎఫ్', 'తెలుసు కదా' సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తున్న ఈ సినిమాను తొలుత వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పనులు ఇంకా ఉండటంతో వీలు కాలేదు. దాంతో ఇప్పుడు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం విజయదశమికి రావాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమాలో నారా రోహిత్, పూజిత పొన్నడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Peddi Collections Day 6 - 'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?