Shankar New Movie With Kollywood Star Ajith Kumar : 'గేమ్ ఛేంజర్', 'భారతీయుడు 2' వంటి డిజాస్టర్స్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్ 'వేల్పరి' అనౌన్స్ చేశారు. అయితే, దాదాపు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేయగా... నిర్మాతలు ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేకపోయినా... అంతకు ముందే శంకర్ మరో మూవీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.
కోలీవుడ్ స్టార్‌తో
శంకర్ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌తో మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ కుదిరితే ఈ సినిమా త్వరలోనే ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం డేర్ డెవిల్, మంకథ 2 మూవీస్ చేస్తున్నారు. డేర్ డెవిల్ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా... సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక 2011లో వచ్చిన మంకథ (తెలుగులో గ్యాంబ్లింగ్) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా 'మంకథ 2' తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌పై బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత శంకర్ మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Also Read : Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
శంకర్ వేల్పారి (Velpari) ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీలో హీరోగా ధనుష్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపించింది. ఎస్ యు వెంకటేశన్ రాసిన 'వీరు యుగ నాయకన్ వేల్పారి' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వేల్పారి వీరత్వంతో పాటు చోళ, పాండ్య రాజులతో ఆయన చేసిన పోరాటాన్ని చూపించనున్నట్లు సమాచారం. మల్టీ స్టారర్‌గా సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుండగా... స్టార్ హీరో ధనుష్‌తో పాటు మరో హీరోను కూడా శంకర్ సంప్రదించినట్లు సమాచారం.
Also Read : SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
