సినీ సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత లుక్స్ పరంగా ఎలా మారుతున్నారు అని ప్రేక్షకులు గమనించగలరు. కానీ వారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు, వారి తల్లిదండ్రులు ఎలా ఉంటారు అనే విషయాన్ని వారు షేర్ చేస్తేనే ఫ్యాన్స్‌కు తెలుస్తుంది. అలా తాజాగా ఒక సీనియర్ హీరోయిన్.. తన తల్లితండ్రుల పాత ఫోటోను షేర్ చేస్తూ వారికి యానివర్సరీ విషెస్‌ను తెలియజేసింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వాళ్లు ఎవరి పేరెంట్సో కనిపెట్టారా?


యానివర్సరీ స్పెషల్..


వారు మాజీ మిస్ యూనివర్సీ ఐశ్వర్య రాయ్.. పేరెంట్స్. యానివర్సరీ సందర్భంగా వారికి సంబంధించిన ఒక పాత ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటి ఫోటో, లేటెస్ట్ ఫోటో రెండూ షేర్ చేసింది. వారికి యానివర్సరీ విషెస్ తెలిపింది. కృష్ణరాజ్ రాయ్, బ్రింద రాయ్ జంటకు 1973లో జన్మించింది ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య తండ్రి కృష్ణ రాయ్.. 2017లో మరణించారు. అందుకే అప్పటి ఫోటోలను షేర్ చేస్తూ.. వారిని అమితంగా ప్రేమిస్తున్నానని, దేవుడి దీవెనలు వారికి ఎప్పుడూ ఉండాలని క్యాప్షన్ పెట్టింది ఐశ్వర్య. యానివర్సరీ మాత్రమే కాదు.. తన తల్లిదండ్రులకు సంబంధించిన ఏ స్పెషల్ రోజు అయినా.. తను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.






తండ్రి గురించి పోస్టులు..
కొన్నిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణరాజ్ జయంతికి కూడా ఆయన ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది ఐశ్వర్య. ఈ ఫోటోలో ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో ఆడుతూ ఉన్నారు కృష్ణరాజ్. హ్యాపీ బర్త్‌డేతో పాటు మిస్ యూ అని ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టింది. అలా ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి, తన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఐశ్వర్య రాయ్. ప్రస్తుతం ప్రొఫెషనల్‌గా అంత యాక్టివ్‌గా లేని ఐశ్వర్య.. పర్సనల్ లైఫ్‌లోనే బిజీ అయిపోయింది. ఇక తాజాగా తన కూతురు ఆరాధ్య యానువల్ డే గురించి తను పెట్టిన పోస్ట్.. అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటిసారి స్కూల్‌లో స్టేజ్‌పై పర్ఫార్మ్ చేసింది ఆరాధ్య. దీంతో ఐశ్వర్య చాలా పొంగిపోయింది.


పర్సనల్ లైఫ్‌పై రూమర్స్..
గతకొంతకాలంగా ఐశ్వర్య రాయ్ పర్సనల్ లైఫ్ గురించి పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉందని, ఇప్పటికే తన అత్తమామలతో ఐశ్వర్య దూరంగా ఉంటుందని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌తో ఐశ్వర్యకు వస్తున్న మనస్పర్థలే విడాకులకు కారణమని పలువురు గుసగుసలాడుతున్నారు. దీంతో పాటు వారితో ఉండకూడదని నిర్ణయించుకొని విడిగా ఉండడం మొదలుపెట్టిందట ఐశ్వర్య రాయ్. కానీ ఈ రూమర్స్‌పై బచ్చన్ ఫ్యామిలీ స్పందించడానికి ముందుకు రావడం లేదు. కానీ ఆరాధ్య స్కూల్ యానువల్ డేకు మాత్రం బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసే వచ్చింది. దీంతో విడాకులు అనేవి కేవలం రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది.


Also Read: ఎన్టీఆర్ అరుదైన ఘనత.. ఆ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ హీరోగా యంగ్ టైగర్!