Adil Khan Marriage: సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ప్రేమ లేదని కారణాలు చెప్పుకొని విడిపోవడం కామన్. అయితే అలా విడిపోయిన జంట మరోసారి వేరే వ్యక్తులతో ప్రేమలో పడి మళ్లీ పెళ్లి చేసుకోవడం కూడా ఈరోజుల్లో కామన్ అయిపోయింది. తాజాగా ముందుగా నటిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత తన నుండి విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిపోయినా కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సీక్రెట్‌గా పెళ్లి..


ఆదిల్ ఖాన్ పేరు చెప్తే.. బాహుశా బాలీవుడ్‌లో ఎక్కువమంది ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ రాఖీ సావంత్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రాఖీ సావంత్ మాజీ భర్తే ఆదిల్ ఖాన్. కొన్నేళ్ల క్రితం రాఖీ, ఆదిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోయారు. ఇప్పుడు రాఖీ సావంత్ మాజీ భర్త ఆదిల్ ఖాన్ దుర్రానీ మరోసారి ప్రేమలో పడ్డాడు. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ అయిన సోమీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి చాలా సీక్రెట్‌గా జరిగిందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాఖీతో విడాకుల తర్వాత ఆదిల్‌కు పూర్తిగా నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది. అందుకే సోమీ ఖాన్‌తో పెళ్లి జరిగిన విషయాన్ని తను అప్పుడే బయటపెట్టాలని అనుకోవడం లేదని సన్నిహితులు చెప్తున్నారు. 


జైలుకు పంపింది..


సోమీ ఖాన్.. తన చెల్లెలు సబా ఖాన్‌తో కలిసి బిగ్ బాస్ సీజన్ 12లో పాల్గొంది. ఆ సీజన్‌లో దీపికా కక్కర్ విన్నర్‌గా నిలిచింది. విన్నర్ అవ్వకపోయినా సోమీ ఖాన్‌కు బిగ్ బాస్ వల్ల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. ఇక ఆదిల్ ఖాన్ విషయానికొస్తే.. తన మాజీ భార్య రాఖీ సావంత్ వల్ల తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు. గతేడాది అంటే 2023లో ఆదిల్‌కు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందనే కారణంపై తనపై కేసు పెట్టింది రాఖీ. అంతే కాకుండా తనపై మరెన్నో ఆరోపణలు చేసింది. దీంతో 2023 ఫిబ్రవరీ 7న ఆదిల్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఆదిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా రాఖీ.. ఏదో ఒక విధంగా తనపై ఆరోపణలు చేస్తూనే ఉంది.


పిల్లలు పుట్టరు..


మైసూరు జైలులో అయిదు నెలలు ఉండి బయటికి వచ్చిన తర్వాత రాఖీ సావంత్‌పై రివర్స్ అటాక్ మొదలుపెట్టాడు ఆదిల్ ఖాన్. ఆదిల్ వల్లే తనకు మిస్ క్యారేజ్ అయ్యిందని రాఖీ ఆరోపించగా.. అసలు రాఖీ ప్రెగ్నెంటే అవ్వలేదని ఆదిల్ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఇక వారి పెళ్లి అయ్యే సమయానికి రాఖీ.. తన మొదటి భర్త అయిన రితేష్‌కు విడాకులే ఇవ్వలేదని అన్నాడు. రాఖీ సావంత్ తన మొదటి భర్త రితేష్‌తో కలిసి బిగ్ బాస్ సీజన్ 15లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక ఆ షో తర్వాత చాలా జరిగాయని కారణం చెప్తూ రితేష్‌తో తాను విడిపోతున్నట్టుగా ప్రకటించింది రాఖీ సావంత్. ఆ తర్వాత ఆదిల్‌ను పెళ్లి చేసుకొని వెంటనే తనతో కూడా విడాకులు తీసుకుంది.


Also Read: నీ ప్రవర్తన నచ్చలేదంటూ లెటర్ రాసి వెళ్లిపోయిన ప్రియాంక ప్రియుడు శివ్, కన్నీళ్లు పెట్టుకున్న బీబీ బ్యూటీ