Trisha Reaction : స్టార్ హీరోస్ హిట్స్ వెనుక త్రిష మ్యాజిక్ - ఫ్యాన్ పోస్టుకు సౌత్ క్వీన్ రియాక్షన్
Trisha Krishnan : స్టార్ హీరోస్ బ్లాక్ బస్టర్స్ వెనుక త్రిష మ్యాజిక్ ఉందంటూ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీన్ని ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన త్రిష థాంక్స్ చెప్పారు.

Trisha Krishnan Reaction On Fan Post About Top Hit Movies : స్టార్ హీరోయిన్ త్రిష లక్కీ ఛార్మ్ అంటూ మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోస్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఆమె భాగం కావడమే ఇందుకు కారణం. ఓ అభిమాని చేసిన పోస్ట్ వైరల్ కాగా... దాన్ని సౌత్ క్వీన్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.
టాప్ కలెక్షన్స్
స్టార్ హీరోస్ అజిత్, విజయ్, సూర్యల కెరీర్‌లోనేనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో త్రిషనే హీరోయిన్. రీసెంట్‌గా సూర్య నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఓ ఫ్యాన్ పోస్ట్ పెట్టగా... వారి బ్లాక్ బస్టర్ విజయం వెనుక త్రిష మ్యాజిక్ ఉందని రాసుకొచ్చారు. దాన్ని త్రిష తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ... హార్ట్ ఎమోజీతో థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది.

Also Read : సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
విజయ్‌తో 'లియో'
ప్రస్తుత తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ విజయ్‌తో లియో మూవీలో త్రిష నటించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. 2023లో రిలీజైన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కీలక పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రూ.248 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
సూర్య కమ్ బ్యాక్ 'కరుప్పు'
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో సూర్య కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)తో కమ్ బ్యాక్ ఇచ్చారు. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లాయర్‌గా ప్రీతి పాత్రలో త్రిష మెప్పించారు.
ఈ 3 సినిమాల్లో త్రిషనే హీరోయిన్ ఆమెనే కావడంతో లక్కీ ఛార్మ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవి 'విశ్వంభర' మూవీలో నటిస్తున్నారు. వశిష్ట మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... అవని పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : వంటింట్లో, కూరల్లో మత్తుమందు... ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ గసగసాల కోసమేనా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























