Trisha Krishnan : మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Trisha Movies Update : సౌత్ క్వీన్ త్రిషను మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ మల్టీ స్టారర్ కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Actress Trisha To Join Kollywood Biggest Multistarrer : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్ ఎవరంటే... వెంటనే గుర్తొచ్చే పేరు సౌత్ క్వీన్ త్రిష. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం తర్వాత ఆమె పేరు మార్మోగిపోయింది. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనూ ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అటు, త్రిష వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ సూర్య కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) ఈ నెల 14న రిలీజ్ కానుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'లో నటించగా అది రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఆమెను వరించినట్లు కోలీవుడ్ మీడియా కోడై కోస్తుంది.
మల్టీ స్టారర్... రెమ్యునరేషన్ ఎంతంటే?
కోలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ అంటే కమల్ హాసన్ (Kamal Haasan), రజనీ కాంత్ (Rajinikanth) మూవీ. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి కనిపిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో త్రిషను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. లేటెస్ట్ బజ్ ప్రకారం ఆమెకు స్క్రిప్ట్ వినిపించినట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. అంతే కాకుండా దాదాపు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
అంతకు ముందు తూంగావనం, మన్మథన్ అంబు, థగ్ లైఫ్ మూవీస్‌లో కమల్‌తో కలిసి త్రిష నటించారు. అలాగే, రజనీ కాంత్‌తో పేట మూవీలో నటించారు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే మరోసారి క్రేజీ కాంబో కన్ఫర్మ్ అని... మల్టీ స్టారర్‌కు సూపర్ బూస్ట్ యాడ్ అవుతుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఓటీటీలో ఈ వారం వెరీ స్పెషల్ - ధురంధర్ 2 To టీవీతో పాటు EXAM... మూవీస్, వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్
రెమ్యునరేషన్స్ వైరల్...
ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'KHxRK Reunion' పేరిట అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీని రెడ్ జెయింట్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కనుండగా... హీరోల రెమ్యునరేషన్స్‌కే భారీగా వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రజనీ కాంత్ రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ తీసుకుంటున్నారట. కమల్ కేవలం రెమ్యునరేషన్‌పైనే కాకుండా ప్రాఫిట్ షేర్ మీద కూడా సినిమా చేస్తున్నారని టాక్. ఆయనకు మొత్తం రూ.220 కోట్ల వచ్చే ఛాన్స్ ఉందట. డైరెక్టర్ నెల్సన్‌కు రూ.70 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఉంటుందని టాక్.
Also Read : మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























