మల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ, కెరీర్ ఫుల్ స్వింగ్ లో కొనసాగిస్తోంది. తాజాగా చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెకిస్తున్నారు. మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలో శృతి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంతో చిత్ర బృందం గురించి తను చేసిన పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఆధ్య షూటింగ్ కంప్లీంట్ - శృతి హాసన్


‘సలార్’ చిత్రంలో శృతి హాసన్ ఆధ్య అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాలో ఆధ్య పాత్ర షూటింగ్ ముగిసిందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. “ఇవాళ్టితో ఈ మూవీలో నా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ‘సలార్’ యూనిట్ తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాను హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది.   






వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శృతి


గతంలో తెలుగులో పలు సినిమాలు చేసిన శృతి హాసన్ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చింది. గత ఏడాది రవితేజతో కలిసి ‘క్రాక్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం శృతి హాసన్ కు హాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ‘ది ఐ’ పేరుతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోందట. ప్రస్తుతం గ్రీస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. 


Read Also: ఆ సినిమా కోసం మాంసాహారం మానేసిన పవన్, కారణం ఏంటో తెలుసా?