సినీ ప్రపంచంలో ఉండే వ్యక్తులు ఎప్పుడు ఎలా మారుతారు అనేది అస్సలు ఎవరికి తెలియదు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళ మార్పులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వాళ్లలో తమ మార్పుతో చెడ్డ పేరుతెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు నటుడు అశోక్ కుమార్ కూతురు రంజిత. రంజిత గురించి ఈతరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ, నైంటీస్ కిడ్స్‌కు మాత్రం బాగా తెలుసు.


రంజిత అసలు పేరు శ్రీ వల్లి. ఇండస్ట్రీకి పరిచయమయ్యాక రంజితగా మారింది. ప్రస్తుతం 'మా ఆనందమయి' అనే పేరు పెట్టుకొని సన్యాస దీక్ష స్వీకరించిందని తెలుస్తుంది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది. తొలిసారిగా ‘కడప రెడ్డమ్మ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో చేసింది. చాలావరకు మంచి గుర్తింపు అందుకుంది.


కానీ వివాదస్వామి నిత్యానంద వ్యవహారంతో ఈమె పరువు మొత్తం పోయింది. అంతేకాకుండా వారి రాసలీలల ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆ సమయంలో తన తండ్రి అశోక్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పరువు పోయిందనే బాధతో ఆమె తల్లి కూడా మరణించింది. అయితే, చాలా కాలానికి రంజిత తండ్రి, నటుడు అశోక్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.


అశోకో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించారు. ఎక్కువగా విలన్ పాత్రలలో చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన మొదట్లో పోలీస్ ఆఫీసర్ గా పని చేయగా ఆ తర్వాత తన మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అవ్వటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హోటల్ నడిపారట. ఆ వ్యాపారానికి నష్టాలు రావడంతో మద్రాస్ కి రాగా ఆ సమయంలో సినిమాలలో విలన్ గా అవకాశాలు వచ్చాయని.. మరి సినిమాలలో చేశాను అని తెలిపారు.


తనకు సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో సినిమాలు మానేశానని తెలిపారు. ఆ తర్వాత తన భార్యను చూడకుండానే పెళ్లి చేసుకున్నాను అని.. కానీ చూశాక ఆమెకు తనకు నచ్చలేదు అని తెలిపాడు. కానీ, తన వల్ల ఒకరి లైఫ్ పాడవకూడదు అని ఆమెను దగ్గరికి తీసుకున్నానని పేర్కొన్నారు. ఇక తమకు ముగ్గురు ఆడపిల్లలు అని.. ముగ్గురికి పెళ్లిళ్లు చేస్తే ఇద్దరు విడాకులు తీసుకున్నారు అని అన్నారు. రంజిత తన భర్తతో గొడవలు జరగటం వల్ల విడాకులు తీసుకుందని.. ఆ తర్వాత తను నిత్యానందను పెళ్లి చేసుకుందని వార్తలు, ఫోటోలు వచ్చాయని తెలిపారు.


అందులో ఎంత నిజం ఉందో తెలియదని అన్నారు. ఇక తన కూతురు విడాకుల వెనుక నిత్యానంద ప్రమేయం ఉందని.. పెద్ద కూతురు కూడా విడాకులు ఇచ్చి దగ్గరికి వెళ్లి పోయింది అని.. భక్తి వల్ల ఇక్కడ హ్యాపీగా ఉన్నామని వాళ్ళు తనకు తెలిపారని అన్నారు. వెంటనే తన ఇద్దరి కూతుర్లని తిట్టానని చెప్పారు అశోక్ కుమార్. అంతే కాకుండా నిత్యానంద దగ్గరికి వెళ్లి సిగ్గు అనిపించడం లేదా.. నా కూతుర్లను నాతో పంపించు అని కూడా అన్నానని తెలిపారు. ఇక వారి వల్లే తమ భార్య అనారోగ్య సమస్యతో బాధపడి చనిపోయిందని పేర్కొన్నారు. భార్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు ‘‘ఛీ దరిద్రపు ముం*ల్లారా.. నా కడుపున చెడ పుట్టారు’’ అంటూ చనిపోయింది అని ఎమోషనల్ అయ్యారు. ఇక నిత్యానంద దగ్గర ఉన్న తన ఇద్దరు కూతుర్లు సంతోషంగా ఉంటున్నామని మూడో కూతురికి మెసేజ్ ల ద్వారా చెబుతూ ఉంటారు అన్నారు.


Also Read: Madhuranagarilo May 24: రాధ కొడుకు మిస్సింగ్ - చావు బతుకుల మధ్యలో శ్యామ్?