Actress Rakul Preet Singh About Bad Incident: సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ట్రోలింగ్, మార్ఫింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా సెల‌బ్ర‌టీల విష‌యంలో అది ఇంకొంచెం ఎక్కువ‌గా ఉంటుంది. వాళ్ల ఫొటోలు మార్ఫింగ్ చేయ‌డం, వాళ్ల వీడియోలు ఎడిటింగ్ చేయ‌డం లాంటివి చేస్తుంటారు. హీరోయిన్ల గురించి నెగ‌టివ్ కామెంట్లు పెట్ట‌డం లాంటివి ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. అలాంటి వాటిపై స్పందించారు ర‌కుల్ ప్రీత్ సింగ్. అలా పోస్ట్ లు పెట్టేవాళ్ల‌ను ప‌ట్టుకుని అంద‌రికీ చూపించాల‌ని అప్పుడే మిగ‌తావాళ్ల‌కి కూడా సిగ్గు వ‌స్తుంద‌ని, వాళ్లు కూడా మార‌తార‌ని అన్నారు. 


పాజిటివిటీ మాత్ర‌మే తీసుకుంటాను.. 


నెగ‌టివ్ కామెంట్స్, అబ్యూజింగ్ పోస్ట్ లు చూసిన‌ప్పుడు ఎలా అనిపిస్తుంది? దాన్ని మీరు ఎలా ఓవ‌ర్ క‌మ్ అవుతారు? అని అడిగిన ప్ర‌శ్న‌కు ర‌కుల్ ఈ స‌మాధానం చెప్పారు. "ఈ ప్ర‌పంచంలో అన్నీ ఉంటాయి. పాజిటివ్ ఉంటాయి. నెగ‌టివ్ ఉంటాయి. నేను అస‌లు నెగ‌టివ్ ని ప‌ట్టించుకోను. నా ఐ స్కాన‌ర్ లోకి కూడా నేను దాన్ని తెచ్చుకోను. పాజిటివ్ గా ఉండేవాళ్ల‌తోనే ఫ్రెండ్ షిప్ చేస్తాను. ఎందుకంటే.. గుడ్ తో రిలేట్ అవ్వాలి బ్యాడ్ తో రిలేట్ అవ్వాలి. బ్యాడ్ తో రిలేట్ కాకూడదు. ఇది చేయాలి అది చేయాలి అని ఆలోచించి టైమ్ వేస్ట్ క‌దా. నాకు చేయాల్సినవి చాలా ఉన్నాయి. నెగ‌టివ్ గా ఎవ‌రైనా పోస్ట్ పెట్టిన‌ప్పుడు అబ్బా నేను వీడికి స‌మాధానం చెప్పాలి, వాడిని తిట్టాలి అనిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో ఫైట్ చేయ‌లేం క‌దా.. అందుకే, ఒక సీక్రెట్ అకౌంట్ మేనేజ్ చేసి తిట్టాలి అని అనుకునేదాన్ని. యూ ఇడియ‌ట్.. అస‌లు జ‌రిగింది ఇదిరా అని చెప్పాలి అనిపిస్తుంది. అబ్యూజింగ్ మెసేజెస్, పోస్ట్ లు స్క్రీన్ షాట్ తీసి, ట్విట్ట‌ర్ వాళ్ల‌కి పంపి, వాళ్ల‌ని ఫైండ్ ఔట్ చేయ‌మ‌ని చెప్పాలి అనిపిస్తుంది. అలా క‌నుక్కుని వాళ్ల చెల్లి, అమ్మ ఫొటోలు అలా చేస్తే ఎలా ఉంటుంది అని అడ‌గాలి అనిపిస్తుంది. చీర క‌ట్టుకున్నా కూడా వాళ్ల‌కి దాంట్లో వేస్ట్ క‌నిపిస్తుంది. దాన్ని తీసుకుని చెప్పుకోలేని భాష‌లో దానికి కామెంట్ పెడ‌తారు. అలాంటి వాళ్ల‌ని తీసుకొచ్చి నీ త‌ల్లి గురించి చెప్పు, నీ కూతురు గురించి చెప్పు, నీ చెల్లి గురించి చెప్పు అని తిట్టాలి అనిపిస్తుంది" అని చెప్పారు ర‌కుల్ ప్రీత్ సింగ్. 


చాలా అకౌంట్లు రిపోర్ట్ చేశా.. 


"న‌న్ను ఇబ్బందిపెట్టి, హ‌ద్దు మీరుతున్నాయి అనిపించిన చాలా సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను రిపోర్ట్ చేశాను. ఎన్ని అకౌంట్ల‌ను మ‌నం అలా చేయ‌గ‌లం. సైబ‌ర్ కంప్లైంట్ లాంటివి ఇవ్వ‌లేదు. ఒకవేళ ఇచ్చినా అలా పోస్ట్ లు పెట్టిన వాడిని ప‌బ్లిక్ లోకి తీసుకురావాలి. అప్పుడే భ‌యం అనేది వ‌స్తుంది. అప్పుడే ఇలా చేయ‌డం ఆపుతారు. అంతేకాని వార్నింగ్ ఇచ్చి వ‌దిలేయ‌డం లాంటివి చేస్తే లాభం లేదేమో అనిపిస్తుంది నాకు." 


ఫొటో తీసాడ‌ని కొట్టాను.. 


"స్కూల్ లో ఎవ‌రినో కొట్టార‌ని విన్నాను?" "నేను ఫ‌స్ట్ ఇయ‌ర్ లో ఉన్న‌ప్పుడు నైనిటాల్ పిక్నిక్ కి వెళ్లాం. కాలేజ్ ట్రిప్ అది. ఒక అబ్బాయి ర్యాండ‌మ్ గా ఫొటోలు తీస్తున్నాడు. స్వెట‌ర్ ట్రై చేస్తున్నాను. అవి కూడా ఫొటోస్ తీశాడు. అప్పుడు ఒక అమ్మాయి వ‌చ్చి "ర‌కుల్ అత‌ను నీకు ఫొటోలు తీస్తున్నాడు" అని చెప్పింది. వెంట‌నే వెళ్లి.. నీ ఫోన్ ఇవ్వు అన్నాను. "ఏమి లేదు ఏమి లేదు" అన్నాడు. నేను అప్పుడు కాల‌ర్ ప‌ట్టుకుని పోలీసుల‌కు ఫోన్ చేస్తాను. 100కి కాల్ చేయండి అని కేక‌లు వేస్తున్నాను. ఫోన్ లాక్కుని చూస్తే 25 ఫొటోస్ వ‌ర‌కు ఉన్నాయి. ఇంత‌లోనే ఫోన్ లాక్కుని ప‌రిగెత్తాడు. నేను ప‌రిగెత్తుకుంటూ వెళ్లి ప‌ట్టుకుని కొట్టాను. న‌న్ను పొట్ట‌లో గుద్ది అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. వెంట‌నే నేను రాయి తీసుకుని కొట్టాను. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను కొట్టాను. లాస్ట్‌కు నేను కొట్టాను. లాస్ట్ దెబ్బ నాది అయితే ఆ కిక్కే వేరు క‌దా. అలా నేను చాలా టామ్ బాయ్ ని. కాలేజ్ ఫెస్ట్ లో కూడా చాలా అల్ల‌రి చేసేదాన్ని. ఎవ‌రో బియ‌ర్ బాటిల్ ప‌ట్టుకుని, కారులో వెళ్తూ తాగి అక్క‌డే ప‌డేస్తే ఆపి వాడికి వార్నింగ్ ఇచ్చాను. అలా చాలా చేశాను" అని త‌న గురించి చెప్పారు ర‌కుల్ ప్రీత్ సింగ్.  


Also Read: ప్రియుడిని పెళ్లాడబోతున్న పూజా హెగ్డే? లీకైన ఫొటోలు