Pavala Syamala : ఫుట్ పాత్‌పై దీన స్థితిలో పావలా శ్యామల - ఇప్పుడు ఎలా ఉందంటే?
Pavala Syamala Condition : ప్రముఖ నటి పావలా శ్యామల ఫుట్ పాత్‌పై దీన స్థితిలో కనిపించడం ఆందోళన కలిగించింది. పోలీసులు ఆమెను RK ఫౌండేషన్ సాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Actress Pavala Syamala In Poor Condition : ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి దీనంగా మారింది. అటు వృద్ధాప్య సమస్యలు, ఇటు అనారోగ్యం, ఒంటరితనంతో ఆమె దయనీయంగా కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఆమెను ఫుట్ పాత్‌పై వదిలేయగా... స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను ఆర్కే ఫౌండేషన్‌కు తరలించారు.
చికిత్సకు డబ్బుల్లేక...
వృద్ధాప్యంతో అనారోగ్యానికి గురైన పావలా శ్యామల శుక్రవారం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స కోసం సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆమెను తిప్పి పంపేశారు. క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను కొంత దూరం తీసుకెళ్లి అర్ధరాత్రి తర్వాత కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రి పూట దిక్కుతోచని స్థితిలో ఆమె ఫుట్ పాత్‌పైనే అలా దీనంగా ఉండిపోయారు. స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి పావలా శ్యామలను దీన స్థితి చూసి... ఆమె ఆశ్రయం పొందుతున్న RK ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి శ్యామలను చికిత్స నిమిత్తం సనత్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన నటనతో నవ్వులు పూయించిన కమెడియన్‌ను ఇలాంటి దీన స్థితిలో చూసి చాలా మంది సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సహాయం అందించాలని ప్రభుత్వాన్ని, సినీ పెద్దలను కోరుతున్నారు.
Also Read : ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన శ్యామల రంగస్థల నటిగా, ఆ తర్వాత మూవీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మనసంతా నువ్వే, ఇంద్ర, అల్లరి రాముడు, ఆంధ్రావాలా, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బలాదూర్, గోలీమార్, చందమామ కథలు, బాబు బంగారం, మత్తు వదలరా మూవీస్ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టాయి. గోలీమార్ మూవీలో విలన్‌తో పావలా శ్యామల సంభాషణ ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతోంది. దీన స్థితిలో ఉన్న ఆమెను ఆర్థికంగా ఆదుకోవాలంటూ సినీ ప్రేమికులు కోరుతున్నారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























