Nidhhi Agerwal About Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానమని... అలాంటి అభిమానం కొందరికి మాత్రమే సాధ్యమని అన్నారు హీరోయిన్ నిధి అగర్వాల్. 'హరి హర వీరమల్లు'లో పవన్‌తో నటించిన ఆమె... తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పవన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ పీఎం కావొచ్చు
సినిమాలతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ చేసిన సేవలతోనే ప్రజలు ఆయన్ను ఇష్టపడతారని అన్నారు నిధి. 'పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానం. అలాంటి క్రేజ్ ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. ఫ్యాన్స్‌ను ఆయన కూడా అలాగే చూసుకుంటారు. 'హరి హర వీరమల్లు' మూవీకి వర్క్ చేసే టైంలో ఆయన్ను ప్రత్యక్షంగా చూశాను. సెట్‌లో అందరితో బాగా మాట్లాడతారు. ఆ మూవీ చేస్తున్న టైంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి 'మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు.' అని అనేవారు.
పవన్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వంద శాతం హార్డ్ వర్క్ చేస్తారు. ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా చెబుతారు. నిజాయతీగా ఉంటారు. భవిష్యత్తులో ఆయన ప్రధాని అయినా ఆశ్చర్యపడను.' అని అన్నారు.
Also Read : క్షుద్ర పూజలు... అంతు చిక్కని రహస్యం - టెర్రిఫిక్‌గా 'హనీ' టీజర్... లుక్ చూస్తేనే...
'ది రాజా సాబ్' మూవీపై...
రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రభాస్ 'ది రాజా సాబ్' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంపై నిధి అగర్వాల్ స్పందించారు. ప్రభాస్ వేటినీ పట్టించుకోరని తెలిపారు. 'ప్రభాస్ ఎలాంటి పాలిటిక్స్‌లో తలదూర్చడు. తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. ఆయన చాలా హుందాగా ఉంటారు. అందరితో ఎంతో అభిమానంగా నిష్కల్మషంగా మాట్లాడతారు. ఎవరైనా సరే ఆయన్ను కలిస్తే ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. ఎంత ఎదిగినా సింపుల్‌గా ఉంటారు.
కమర్షియల్‌గా ఉండడం రాదు. దేనికి కూడా లెక్కలేసుకోరు. ఆయనకు ఎలాంటి పీఆర్ టీం కూడా లేదు. తనతో కలిసి పని చేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. సినిమా కోసం ఫుల్ హార్డ్ వర్క్ చేస్తారు. రిజల్ట్ గురించి పట్టించుకోరు.' అంటూ చెప్పారు.
నెగిటివ్ పీఆర్ వ్యవస్థపై...
అలాగే, రీసెంట్‌గా బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన నెగిటివ్ పీఆర్ వ్యవస్థపైనా నిధి రియాక్ట్ అయ్యారు. ఒకరిని టాప్ ప్లేస్‌లోకి తీసుకెళ్లడానికే కాకుండా... తొక్కేయడానికి కూడా భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. యాక్టర్స్‌కు కూడా ఎమోషన్స్ ఉంటాయని... నెగిటివిటీ వల్ల వాళ్లు మానసికంగా కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు వాళ్ల కుటుంబాలు కూడా తీవ్ర వేదన అనుభవిస్తాయని అన్నారు.
సరైన హిట్ కోసం...
2017లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్... తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో 'సవ్య సాచి' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను, హీరో, హరి హర వీరమల్లు, ది రాజా సాబ్ మూవీస్ చేశారు. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. గతేడాది 'హరి హర వీరమల్లు', ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'రాజా సాబ్' సైతం నిరాశపరిచాయి. రాబోయే రోజుల్లో సరైన హిట్ కొట్టేందుకు వెయిట్ చేస్తున్నారు.