Actress Indraja: ఒకప్పుడు హీరోయిన్‌గా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఇంద్రజ.. ఇప్పుడు పూర్తిగా బుల్లితెరకే పరిమితమయ్యారు. ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా బిజీగా గడిపేస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పుడు కంటే ఇప్పుడే ఇంద్రజ.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇంద్రజ.. హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే తమిళ సీరియల్ ఆర్టిస్ట్ అయిన అబ్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా తన ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్తూనే ఉంటారు ఇంద్రజ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన భర్త గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి మరొక్కసారి ప్రేక్షకులతో పంచుకున్నారు.
అర్థం చేసుకున్నాం..
‘‘ఆయనకు మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, నాకు ఉన్న బాధ్యతలు తెలుసు. అప్పట్లో ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత చూసుకోవడం కోసమే చదువు మానుకొని సినిమాల్లోకి వచ్చాను. అదంతా ఆయనకు తెలుసు. ఆయన కుటుంబం గురించి కూడా నాకు తెలుసు. ఆరేళ్ల పాటు ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టి నీకు ఎవరూ దొరకరు. నాకు ఎవరూ దొరకరు. మనం ఇద్దరమే పెళ్లి చేసుకుందాం అనుకొని చేసుకున్నాం. మావయ్యకు ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ ఉంది మా ఆయన అదే చూసుకుంటారు. కానీ యాక్టింగ్ మీద ప్యాషన్‌తో కొన్ని సీరియల్స్‌లో నటించారు, రైటర్‌గా చేశారు. కానీ మేమిద్దరం ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి క్లోజ్ అయ్యాం’’ అని ఇంద్రజ తెలిపారు.
చాలా డ్రీమ్ రోల్స్..
పర్సనల్ లైఫ్‌తో పాటు తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా ఇంద్రజ మాట్లాడారు. ‘‘డ్రీమ్ రోల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా పెద్దగా ఏమీ చేయలేదని నా ఫీలింగ్’’ అని తెలిపారు. ఇక తన ఫేవరెట్ హీరో, హీరోయిన్ గురించి చెప్తూ.. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు నచ్చుతారని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్క ఫ్రేమ్‌కు అందంగా చూపించే దర్శకులంటే తనకు ఇష్టమని, అలా చూసుకుంటే సంజయ్ లీలా భన్సాలీ, గుణశేఖర్ తన ఫేవరెట్ డైరెక్టర్స్ అని తెలిపారు. ‘‘నా కెరీర్‌లో నేను చేశానని చాలా గర్వంగా చెప్పుకునే మూవీ అయితే సొగసు చూడతరమా. అది కాకుండా మహేశ్ బాబు నటించిన ఖలేజా నా ఫేవరెట్’’ అని బయటపెట్టారు ఇంద్రజ.
త్రివిక్రమ్‌పై ప్రశంసలు..
‘‘త్రివిక్రమ్‌ది ఏ మూవీ చూసినా లోపల ఒక ఆధ్యాత్మిక విషయం ఉంటుంది. అదే మెయిన్ పాయింట్. దాని చుట్టూ చాలా ఎంటర్‌టైన్మెంట్, ఫన్ ఉంటుంది. ఆయన ఎంత లోతుగా ఆలోచిస్తారో చాలా తక్కువమందికి అర్థమవుతుంది. ఈరోజుల్లో ఉన్న ఆలోచింపజేసే దర్శకులలో ఆయన ఒకరు’’ అంటూ త్రివిక్రమ్‌ను ప్రశంసలతో ముంచేశారు ఇంద్రజ. ఇక తన మూడ్‌ను బట్టి తను చూసే సినిమా జోనర్లు కూడా మారుతూ ఉంటాయని అన్నారు. తన కూతురికి అసలు తెలుగు రాదని, ఈమధ్యే నేర్పిస్తున్నానని బయటపెట్టారు. ఇంట్లో ఉన్నప్పుడు అసలు సినిమాల గురించి మాట్లాడమని, అది వాళ్ల ప్రైవేట్ లైఫ్ అని అన్నారు ఇంద్రజ.