Actress Ashu Reddy Reaction About Engagement Photos : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా షేర్ చేసిన ఫోటోస్ రీసెంట్‌గా వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇస్తూ మరిన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఆమె చేతిలో చేయి వేసింది ఎవరో రివీల్ చేశారు.

Continues below advertisement

'కళ్లతో చూసేది నిజం కాదు'

మనం కళ్లతో చూసేది నిజం కాదంటూ... విక్రమ్ ఆన్ డ్యూటీ (Vikram On Duty Series) వెబ్ సిరీస్ షూటింగ్ సెట్‌లో ఫోటోస్ షేర్ చేశారు అషు రెడ్డి. ఆమె ఈ సిరీస్‌లో నటిస్తుండగా... హీరోతో జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోస్‌ను ఇన్ స్టాలో షేర్ చేశారు. గత ఫోటోల్లో అషు రెడ్డితో పాటు కనిపించిన చెయ్యి... బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ మళయక్కల్‌ది.

Continues below advertisement

'మనం కళ్లతో చూసేది లేదా చెవులతో వినేది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. నిజం అనిపించే ప్రతిదీ నిజం కాదు. నమ్మే ముందు ఆలోచించండి.' అంటూ రాసుకొచ్చారు అషు రెడ్డి. షూటింగ్‌లో భాగంగా హీరోతో ఎంగేజ్మెంట్ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది రియల్ ఎంగేజ్మెంట్ కాదని తేలిపోయింది. రీసెంట్‌గా వచ్చిన మోసం ఆరోపణలపై రియాక్ట్ అవుతూ ఆమె ఇలా ఫోటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : రియల్ లైఫ్ అమ్మ... రీల్ లైఫ్‌ యాక్షన్ - ఈ స్టార్ హీరోయిన్స్ డెడికేషన్ వేరే లెవల్

అసలేం జరిగిందంటే?

తమ కుమారుడిని పెళ్లి పేరిట రూ.9.35 కోట్ల మేర అషు రెడ్డి (Ashu Reddy) మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించారు. లండన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తమ కుమారుడు ధర్మేంద్ర భారత్‌కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి చేసుకుంటానని డబ్బులు అడిగినట్లు తెలిపారు. బంగారం, కార్లు, ఆస్తులు కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు.

దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అషు రెడ్డి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌పై విచారిస్తున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ అషు రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. పోలీస్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. అయితే, అషు రెడ్డి పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. 

మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.