Shravan Reddy Shares Intresting Facts About Agadha World : 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'వర్షం', 'ఒక్కడు' వంటి బ్లాక్ బస్టర్స్ మూవీస్ నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకత్వంలో రాబోతోన్న డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ 'అగధ'. పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల, డర్టీ హరి ఫేమ్ శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర విశేషాల్ని హీరో శ్రవణ్ రెడ్డి షేర్ చేసుకున్నారు.
'అగధలో డిఫరెంట్ రోల్'
'డర్టీ హరి' డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుందని... ఆ టైంలోనే తనకు చాలా ఆఫర్స్ వచ్చాయని చెప్పారు శ్రవణ్ రెడ్డి. 'కరోనా, లాక్డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చాయి. 'మంగళవారం' సినిమా కోసం దాదాపు ఏడాది వెచ్చించాను. ఫైనల్‌గా ఎంఎస్ రాజు నాకు అగధ ఛాన్స్ ఇచ్చారు. 'డర్టీ హరి'కి పూర్తి భిన్నంగా 'అగధ' పాత్ర ఉంటుంది.
చాలా కోణాలు ఉండేలా కారెక్టర్‌ను డిజైన్ చేశారు. నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. హారర్, థ్రిల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఏదైనా సరే కొత్తగా ఓ హుక్ పాయింట్ ఉండాలని ఎంఎస్ రాజు గారు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో నెగిటివ్ రోల్ అనేది ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా సాగుతుంది.' అని తెలిపారు.
సీక్వెల్‌పై...
'అగధ' చిత్రాన్ని దాదాపు నేచరల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశారని... కొన్ని మాత్రం సెట్స్ వేశారని తెలిపారు శ్రవణ్ రెడ్డి. 'మిస్టిక్, హారర్ ఫీల్‌ను ఇవ్వడానికి సెట్స్ వేయాల్సి వచ్చింది. మా సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా నీట్‌గా, ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఇలాంటి చిత్రాలకు పర్టిక్యులర్‌గా పార్ట్ 2 అని వేయకపోయినా.. కథను అల్లుకోవచ్చు. మరి ఎంఎస్ రాజు గారు రెండో పార్ట్ ఎప్పుడు అంటారో చూడాలి.ట అని అన్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రాజ్ అండ్ డీకే టీంలో పని చేసిన చంద్ర దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్నట్లు తెలిపారు శ్రవణ్ రెడ్డి. 'ఆల్రెడీ కాశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం. కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల్లో ఉన్నాయి. నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకుంటాను. 'అగధ'లో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతిసారి డిఫరెంట్ జానర్‌లో కొత్తగా ప్రయత్నించాలని చూస్తుంటాను.' అని చెప్పారు.
ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
