Bobby Simha About Chiranjeevi : బాబీసింహా.. 'వాల్తేరు వీరయ్య', 'పేటా', 'సలార్‌' లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాడు. తన నటనతో, టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాబీ సింహా.. ఇప్పుడు చిరంజీవి గురించి చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. సినిమాల్లో బిజీగా ఉన్న బాబీ సింహా.. ఈ మధ్య ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఇలా చెప్పారు. 


ఆయన్ని చూసి నోట మాటరాలేదు... 


"చిరంజీవిని మొదటిసారి చూసిన ఎక్స్‌పీరియెన్స్‌ అసలు చెప్పలేనిది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూట్‌లోనే ఫస్ట్‌టైమ్‌ ఆయన్ని చూశాను. డైరెక్టర్‌ బాబీ.. అన్నయ్య వచ్చేస్తున్నాడని చెప్పగానే మానిటర్‌లో చూసి, ఆ తర్వాత డైరెక్ట్‌గా చూశాను. గుండె లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ అని కొట్టుకుంది. ఏమీ మాట్లాడలేకపోయాను అసలు. బాబీ తీసుకెళ్లి ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాడు. ఏమీ మాట్లాడకుండా సార్‌... సార్‌ అంటూ ఉండిపోయా. ఆయన అర్థం చేసుకుంటారు కదా. ఇక అది నాకు ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌. చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం కదా. ఆయన్ని అలా లైవ్‌‌లో చూడటం, మాట్లాడటం, ఆయనకు కో యాక్టర్‌గా ఉండటం నిజంగా అది నా అదృష్టం. కాంబినేషన్‌ సీన్‌లో ఏం మాట్లాడలేకపోయాను. ఆయన యాక్టింగ్‌ అలాంటిది. ఆయన కళ్లు అలా మాట్లాడేస్తాయి. ఆయన స్మైల్‌. టక టక టక ఎక్స్‌ప్రషన్స్‌ మార్చేస్తారు. చాలా నేర్చుకోవచ్చు" అని చిరంజీవి గురించి చెప్పారు బాబీ సింహా. 


ప్రభాస్‌ అంటే కూడా ఇష్టం... 


ప్రభాస్‌ అంటూ కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పారు బాబీ. ఆయన ఛత్రపతి చూసినప్పుడే ఫ్యాన్‌ అయిపోయానని అన్నారు. కానీ, కలిసి నటించే ఛాన్స్‌ రాలేదని, లాస్ట్‌లో తనకు డైరెక్టర్‌ ముందుగానే ఆ విషయం చెప్పాడని అన్నారు. ప్రస్తుతం బాబీ 'సలార్‌ - 2'లో నటిస్తున్నాడు. ఏప్రిల్‌ ఈ మూవీ షూటింగ్ మొదలుకానుందని హింట్‌ ఇచ్చారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.


ఇక బాబీ సింహా 'సలార్‌', 'రజాకార్‌', 'చిక్కడు దొరకడు', 'వాల్తేరు వీరయ్య', 'జల్లికట్టు', 'పేట', 'డిస్కోరాజా',  'స్వామి2' తదితర సినిమాల్లో నటించారు. ఈయన నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బాబీ సింహా చేసిన ప్రతి క్యారెక్టర్‌లో ఆయన నటన అద్భుతంగా ఉంటుందని ఎంతోమంది ప్రశంసలు పొందారు. 


గతంలోనూ.. 


అయితే, బాబీ సింహా చిరంజీవిపై ప్రశంసలు కురిపించడం కొత్తేమి కాదు. ఆయన గతంలో కూడా ఒకసారి ఆయన్న పొగుడుతూ ట్వీట్‌ చేశారు. మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని అన్నారు. చిరంజీవి నటించిన 'ఛాలెంజ్', 'ముగ్గురు మొనగాళ్ళు', 'విజేత', 'స్టేట్ రౌడీ' వంటి సినిమాలు చూశానని బాబీ సింహా వెల్లడించారు. ఈ ట్వీట్‌ 'వాల్తేరు వీరయ్య' సినిమా టైంలోనే చేశారు ఆయన. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో బాబీకి కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి.


Also Read: 'సలార్‌ 2'పై లీక్‌ ఇచ్చిన బాబీ సింహా - ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే