Actor Ajith Kumar Mother Mohini Passed Away : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహిని (84) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి  సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతోనే కన్నుమూశారు.

Continues below advertisement

అజిత్ మాతృమూర్తి మృతి పట్ల కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ నిమిత్తం అజిత్ దుబాయ్‌లో ఉండగా... తన తల్లి మరణవార్త విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వెంటనే చెన్నైకు బయలుదేరారు. ఆయన చెన్నై చేరుకున్న వెంటనే అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read : రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Continues below advertisement