Satyam Rajesh's Polimera 3 Update : మా ఊరి పొలిమేర... డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్‌తో వచ్చిన పొలిమేర 2 కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా రెడీ అవుతోంది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది.
హారర్ థ్రిల్లర్‌లో యాక్షన్ కింగ్
ఈ హారర్ థ్రిల్లర్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు మూవీ టీం స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. మరి ఆయన రోల్ ఏంటి? అనేది రివీల్ చేయలేదు. అర్జున్‌కు స్వాగతం పలుకుతూ... 'యాక్షన్ మీట్స్ పవర్' అంటూ వీడియోను టీం పంచుకుంది. హారర్ థ్రిల్లింగ్ అంశాలు ఉన్న మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటించవచ్చనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. పొలిమేర ఫ్రాంచైజీలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో...
గత రెండు పార్టులకు వచ్చిన సూపర్ రెస్పాన్స్‌తో 'పొలిమేర 3' మరింత థ్రిల్లింగ్ అంశాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్యలతో పాటు గెటప్ శ్రీను, సాహితి దాసరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు.
ఫస్ట్ పార్ట్‌లో ఓ పల్లెటూరిలో జరిగే అనుమానాస్పద హత్యలు, క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. హారర్, థ్రిల్లింగ్ అంశాలు హైప్ క్రియేట్ చేశాయి. అలాగే, రెండో పార్ట్‌లో గ్రామంలో ఉండే ఆలయం వెనుక నిధి రహస్యం, క్షుద్రపూజలతో నిధిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు, హిమాలయాల్లో మిస్టరీ అంశాలను సస్పెన్స్‌గా చూపించారు. నిజానికి రెండో పార్టులో ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా వదిలేశారు. ఇప్పుడు మూడో పార్టులో వాటికి సమాధానాలు చెప్పడం సహా సరికొత్త అంశాలను యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
