'లై', 'చల్ మోహన్ రంగా', 'డియర్ మేఘ', 'గుర్తుందా శీతాకాలం' వంటి సినిమాలతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేఘా ఆకాష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఈ ఏడాది అయితే మేఘ ఆకాష్ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'సఃకుటుంబనాం' అనే పేరుతో తెరకెక్కుతున్న మూవీలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కిరణ్ హీరోగా కనిపించనున్నాడు.


క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం హైదరాబాదులో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ ఎన్ జి మూవీస్ సినిమాస్ పతాకంపై హెచ్. మహదేవ్ గౌడ, హెచ్. నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత AM రత్నం క్లాప్ కొట్టారు. చిత్ర నిర్మాత మహాదేవ గౌడ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేయగా, ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఉదయ్ శర్మ దర్శకత్వం వహించారు.


చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. "కథ వినగానే నిర్మాత ఓకే చేసిన సినిమా ఇది. చిత్రంలో తన పాత్ర గురించి చెప్పగానే కొత్త హీరో అని చూడకుండా మేఘా ఆకాష్ వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఆ తర్వాత మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. "సినిమాలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పారు.


హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. "ఈ సినిమాకి కథే హీరో. ఈ కథను నమ్మి ఇంత మందికి అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్. అన్ని ఎమోషన్స్ తో కూడిన చాలా శక్తివంతమైన కథ ఇది. ఈ కుటుంబ కథా చిత్రం అందరికీ నచ్చుతుంది" అని అన్నారు. 'కథ వినగానే నచ్చి ఈ సినిమా చేస్తున్నా. న్యూ కాన్సెప్ట్ తో రూపొందున్న ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్మకం ఉంది’’ అని నిర్మాత తెలిపారు. హీరో అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న రామ్ చరణ్ కెరియర్ కు విచిత్రం మంచి బిగినింగ్ అవుతుందని కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.


రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, రాహుల్ రామకృష్ణ, సత్య, రచ్చ రవి, శుభలేఖ సుధాకర్, భద్రం, ప్రగతి లాంటి ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, శశాంక్ మాలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందిస్తుండగా, మధు దాసరి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. తదితర సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ఆర్ట్ : పి ఎస్ వర్మ, అడిషనల్ స్క్రీన్ ప్లే : బాలాజీ భువనగిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రోహిత్ పద్మనాభం.


Also Read : ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల



Join Us on Telegram: https://t.me/abpdesamofficial