AAY Movie Hari Introducing Video: గత ఏడాది విడుదలైన ‘మ్యాడ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కుర్రాళ్లను ఓ రేంజిలో ఆట్టుకుంది. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం ‘ఆయ్’ పేరుతో తెరకెక్కుతోంది. కోనసీన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘సుఫియానా..’ అంటూ సాగే పాట వినసొంపుగా అలరించింది.
ఫన్నీ డైలాగులతో ఆకట్టుకున్న అంకిత్ కొయ్య
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అంకిత్ కొయ్యను హరిగా పరిచయం చేస్తూ ఈ వీడియోను వదిలారు. కోడిపందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొనే వారిని పోలీసులు స్టేషన్ ముందు కూర్చోబెట్టే సీన్ తో ఈ వీడియో మొదలవుతుంది. ‘సుబ్బాలమ్మ జాతర సందర్భంగా జాహ్నవి డ్యాన్స్ ప్రోగ్రాంకు పర్మిషన్ అడిగేందుకు వచ్చామని చెప్పడంతో, హరి ఎగ్జైట్ అవుతాడు. “జాన్వీ వస్తుందా? ఎలా ఉంది బాబాయ్? ఒళ్లు చేసిందా? రంగొచ్చిందా? గ్లామరేమన్నా పెంచిదా? చూసి చాలా రోజులైంది?” అంటాడు. ఈ సంవత్సరం అయినా పర్మిషన్ ఇస్తారో? లేదో? అనడంతో.. జాహ్నవి రావడానికి పర్మిషన్ కావాలా? అంటూ రెచ్చిపోతాడు.
“ఎందుకు తీసుకోవాలి బాబాయ్ వీళ్ల పర్మిషన్? మా టీవీలో ‘మా అవార్డ్స్’కు, జీ టీవీ ‘జీ అవార్డ్స్’కు, ఈ టీవీలో ‘జబర్దస్త్’, ‘ఢీ’జోడీ, మా జోడీ, పకోడీ అంటూ ఏ ఎంటర్ టైన్మెంట్ కు లేని పర్మిషన్ మనం ఎందుకు తీసుకోవాలి బాబాయ్? పండగొస్తే చాలు డ్యాన్స్ ప్రోగ్రామ్ లు ఉంటాయో? ఉండవో? అనే టెన్షన్ తో మా కుర్రాళ్లు చచ్చిపోతున్నారు. ప్రతిసారి ఇంతే. ఎంతో ఆశగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కు వెళ్తే పోలీసులు ఆపడంతో నీరసంగా ఇంటికి వచ్చేస్తున్నాం. ఈసారి కోడి పందేలు, గుండాట, డ్యాన్సులకు ఎలాంటి పర్మిషన్ లేదని మ్యానిఫెస్టోలో పెట్టిన వారికే మా ఓటు.. ఏమంటార్రా? అనగానే ‘ఆయ్’ అనడంతో వీడియో కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది.
త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్న మేకర్స్
‘ఆయ్’ సినిమాలో నార్నే నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా కనిపించనుంది. రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ ఫన్నీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు