అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్', 'మాస్ జాతర' విడుదల అవుతుండటంతో తన 'ఆర్యన్' సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ ఒక వారం వాయిదా వేశాడు హీరో విష్ణు విశాల్. నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. రెండు రోజుల ముందు... ఆక్టోబర్ 29 రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు. మరి సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఏంటి? నేడు చూస్తే...

Continues below advertisement

ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్!'ఆర్యన్' చూసిన క్రిటిక్స్, ఆడియన్స్ చెప్పే మాట ఒక్కటే... ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని! టిపికల్ కథతో సినిమా తీశారని! ఒక్క డల్ మూమెంట్ కూడా లేదని చెబుతున్నారు. తమిళ క్రిటిక్స్ అయితే 3.5 నుంచి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. చివరి 20 నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని తెలిపారు.

సైకో కిల్లర్ కథతో 'ఆర్యన్' తెరకెక్కింది. తాను చేసే పనులకు ఒక పర్పస్ ఉందని ఆ సీరియల్ కిల్లర్ భావించడంతో పాటు తాను వేసే ప్రతి అడుగు ఒక పథకం ప్రకారం, పక్కా ప్రణాళికతో వేస్తే అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఎంత కష్టపడ్డారు? అనేది సినిమా కథ అని టాక్. 

Continues below advertisement

విష్ణు విశాల్... సెల్వ రాఘవన్...ఇద్దరూ ఇద్దరే... సూపర్బ్ యాక్టింగ్!'ఆర్యన్'లో విష్ణు విశాల్ హీరోగా నటించగా... సెల్వ రాఘవన్ విలన్ రోల్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరూ సూపర్బ్ యాక్టింగ్ చేశారట. విష్ణు విశాల్ తమిళ్ హిట్ 'రాచ్చసన్'ను తెలుగులో 'రాక్షసుడు'గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేశారు. తమిళంలో 'రాచ్చసన్' రేంజ్ హిట్ అని క్రిటిక్స్ చెబుతున్నారు. ఆ సినిమాతో కంపేర్ చేస్తే... విష్ణు విశాల్ కంప్లీట్ డిఫరెంట్ రోల్ చేశారట. అరుదుగా నవ్వే ఒక పోలీస్ అధికారిగా ఆయన నటన కథపై క్యూరియాసిటీ కలిగించేలా ఉండటంతో పాటు ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉందట. అరుదుగా నవ్వే పోలీసుగా విష్ణు విశాల్ నటనపై ప్రశంసలు వచ్చాయి.

Also Readఅప్పుడు అమ్మను రానివ్వలేదు... ఇప్పుడు కూతుర్ని మహేష్ ఫ్యాన్స్ వద్దంటారా?

సెల్వ రాఘవన్ చేసినది ప్యారలల్ హీరో రోల్ అన్నట్టు ఉందట. ఆయన కూడా బ్రిలియంట్ యాక్టింగ్ చేశారట. 

హీరోయిన్ల క్యారెక్టర్లు ఒకే... ఫైన్!'ఆర్యన్'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు శ్రద్ధా శ్రీనాథ్ కాగా... మరొకరు తెలుగు అమ్మాయి మానసా చౌదరి. ఇద్దరూ తమ తమ పాత్రల్లో బాగా చేశారని చెబుతున్నారు. దర్శకుడు బ్రిలియంట్ స్క్రిప్ట్ తో సినిమా తీశారని, ఆయన కథకు తగ్గట్టు జిబ్రాన్ మంచి ఆర్ఆర్ చేశారని తమిళ్ నుంచి అప్లాజ్ వచ్చింది. తెలుగులో వారం తర్వాత వస్తుంది కనుక అక్కడ నుంచి వచ్చే పాజిటివ్ రివ్యూస్ హెల్ప్ అవుతాయని చెప్పవచ్చు.

Also Readఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?